Tuesday, 29 November 2016

పద్మనాభస్వామి ఆలయం తిరువనంతపురం

కొట్టారక్కర నండి చివరగా మేం తిరువనంతపురం బయలుదేరి కొంత దూరం రాగానే భోజనం ముగించుకొని బస్సు ఎక్కాం. ఎక్కడా సరైన మన భోజనం దొరకదు,  పరోటాలే ఆధారం. చల్లని నీల్ల బాటిల్ అడిగితే వింతగా చూస్తున్నారు, అంతటా ఆయుర్వేద మూలికలతో మరిగిస్తున్న నీటినే తాగుతున్నారు. తిరువనంతపురం చేరి హోటల్ రూం తీసుకునేసరికి రాత్రి 12.00 అయింది. ఉదయాన్నే పద్మనాభస్వామి ఆలయానికి బయలుదేరి పెళ్లాం. కేరళ ఆలయాలలో ప్రధానంగా రెండు గుర్తుపెట్టుకోవాలి.
మగవారు చొక్కా/బనీను/ప్యాంటు ధరించరాదు. పంచెలో
మాత్రమే వెళ్ళాలి. ఆడవారు చీర/పంజాబీ డ్రెస్సులో
వెళ్లవచ్చు. మగవారి నిబంధనలు చిన్న పిల్లలకు కూడా
వర్తిస్తాయి. ముందుగానే తెలుసు కాబట్టి పంచె కట్టుకొని బయలుదేరాము.
లేదంటే ఆలయం ముందు కొనుక్కోవచ్చు. చొక్కాలు, పర్సులు, ఫోన్లు క్లాక్ రూంలో పెట్టి లోపలికి వెళ్లాం. కేరళ లో ఎక్కడా కొబ్బరికాయలు కొట్టే సాంప్రదాయం కనిపంచలేదు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం..
అంతులేని సంపదకే కాదు, అనంత మహిమలకూ ప్రతీకనే అంటారు. భారతదేశంలోని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో 11 కేరళలో ఉన్నాయి. అందులో తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం ఒకటి. ఆలయం ఒకప్పుడు
"ఎట్టువీట్టిల్ పిల్ల మార్" అనే ఎనిమిది కుటుంబాల వారి
నిర్వహణలో వుండేదిట. తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్
సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని
తన అధీనంలోకి తెచ్చుకుని, 1729 సంవత్సరంలో
పునరుద్ధరించి, ఆలయానికి తామే సమస్తమంటూ ప్రకటించిన నాటినుండి ఇప్పటివరకూ వారి ఆధీనంలోనే ఉంది. ఈ దేవాలయంలో దైవ దర్శనమంటే, ఆదిశేషుడి
మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుడి 18 అడుగుల
మూర్తిని మూడు ద్వారాల నుంచి-ముఖాన్ని దక్షిణ ద్వారం నుండి,
పాదాలను ఉత్తర ద్వారం నుండి, నాభిని మధ్య ద్వారం నుండి
దర్శించు కోవడమే. ఇటీవల కోర్టు ఆదేశంతో ఆలయ నేల మాళిగలలో గదుల నుంచి వెలికి
తీసిన టన్నుల కొద్దీ బంగారం, బంగారు వజ్రా భరణాలు, వజ్ర-
వైఢూర్యాలు, దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు
పొదిగిన నగలు, పురాతన బంగారు వెండి నాణాలు, కోట్లాది
రూపాయల విలువ చేసే విష్ణుమూర్తి బంగారు విగ్రహం, బంగారంతో
చేసిన ఏనుగు బొమ్మ, కేజీల కొద్దీ ఇతర బంగారు
విగ్రహాలు, వేలాది కంఠాభరణాలు, గొలుసులు,  ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సంచుల్లో
భద్రపరిచిన 16వ శతాబ్దం నాటి శ్రీ కృష్ణదేవరాయల
కాలం నాణాలు, ఈస్టిండియా కంపెని, నెపోలియన్ కాలాల నాటి
నాణాలు కూడా లభ్యమయ్యాయంటున్నారు. బంగారు గొలుసులు,
బంగారు టెంకాయలు, స్వర్ణ శంఖాలు, తదితర చిత్ర
విచిత్రమైన పురాతన వస్తువులు అక్కడ లభ్యం కావడం
ప్రపంచమంతటినీ విస్మయానికి గురిచేసింది. ఇవన్నీ ఇన్ని
సంవత్సరాలుగా నేలమాళిగలో నిక్షిప్తమై పోయాయి. మానవ
మాత్రులెవ్వరూ, ఇప్పటి వరకు, కనీ వినీ ఎరుగని, కళ్లారా
ఒక్క చోట చూడని "అనంతమైన సంపద", పద్మనాభ స్వామి
ఆలయంలో బయటపడింది.

Monday, 28 November 2016

మహాగణపతి దేవాలయం కొట్టారక్కర

మహాగణపతి దేవాలయం కొట్టారక్కర
తిరువనంతపురం బయలుదేరిన మాతో డ్రైవర్ దారిలో మరో ప్రముఖ దేవస్థానం తీసుకెళ్తాననటంతో సరేనన్నాం. అయితే దగ్గర లోనే అనుకున్నాం కానీ దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెద్ద కోనేరు, విశాలమైన మండపాలతో పెద్దగా ఉంది ఆలయం. వాస్తవానికి ఇది శివాలయం కానీ మహాగణపతి దేవాలయం గా ప్రసిద్ధికెక్కింది. పూర్వకాలంలో ఇక్కడి రాజులు శివాలయం నిర్మిస్తున్నపుడు దగ్గరలో ఉన్న పుట్టలోనుండి  మంత్రాలు వినపడడంతో తవ్వి చూడగా వెలసిన గణపతి పేరనే  ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఓనం మాసం కావడంతోమేము వెళ్లిన సమయంలో ఆలయం లో ప్రత్యేక పూజలు జరుతుండడంతో దర్శనానికి అరగంట సమయం పట్టింది.  తూర్పు ముఖంగా శివుడు, దక్షిణ ముఖంగా గణపతి, ఉత్తరంవైపు అయ్యప్ప స్వామి, పడమర వైపు పార్వతిదేవి దర్శనమిస్తారు. బియ్యం, బెల్లం, అరటిపండు, చెక్కర, నెయ్యి, కొబ్బరితో చేసిన మధురమైన ఉన్నిఅప్పం అనే వంటకాన్ని గణపతి కి సమర్పించి ప్రసాదంగా ఇస్తున్నారు. ఇది కేరళ లో చాలా ప్రసిద్ధమైంది.

Tuesday, 22 November 2016

మళయాలప్పుజ

అయ్యప్ప సన్నిధి నుండి తిరిగి పంప  చేరుకోవడానికి దాదాపు 3.00 గంటలు పట్టింది. దేవస్థానం వారి వాహనాలు నడిచే రోడ్డుపై కాకుండా మెట్లదారి గుండా దిగాలి, కానీ కొంతమంది రోడ్డు గుండా దిగాం, కానీ సురక్షితంగా లేదు. పంపవద్ద BSNL మాత్రమే పనిచేస్తోంది. అలసిపోయిన మాకు భోజనం ముగించుకొని బస్సు ఎక్కగానే వెంటనే నిద్రపట్టింది. దాదాపు 60 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత చిన్న హోటల్ spicey.com దగ్గర ఆగాం. ఇంత దూరం వచ్చి ఏమీ చూడకుండా వెళ్తున్నామన్న మా మాటలు విన్న  మేనేజర్ మాతో మాట్లాడుతూ దగ్గరలోనే ఉన్న ఆలయం గురించి చెప్పడంతో మళయాలప్పుజ దేవి ఆలయానికి వెళ్లాం. భక్తుల తాకిడి కొంత తక్కువగా ఉంది. అయ్యప్ప దర్శించి వెళ్లేవారు చాలామంది ఇక్కడకు వస్తారట. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున స్టాల్ లో ఎర్రని విత్తనాలు  అమ్ముతున్నారు. ఈ  విత్తనాలతో దేవిని పూజిస్తే శత్రు బాధలు నివారింపబడతాయట. తర్వాత మా ప్రయాణం కేరళ రాజధాని తిరువనంతపురంకు.

Tuesday, 8 November 2016

శబరిమల

దక్షిణ భారతంలోని పశ్చిమ కనుమలకు చెందిన
దట్టమైన అరణ్యంలో కొండకోనల మధ్య ఉన్న శబరిమలకు బయలుదేరి ఉదయాన్నే 3.30కి  పంపానదికి చేరిన మేము వెంటనే నదీస్నానం చేసి హరిహర సుతుని దర్శనానికి బయల్దేరాం కాలినడకన. నడవలేని వారికి డోలీలు ఉన్నాయి. దేవస్థానం వారి డోలీలైతే మంచిది. 7 కిలోమీటర్ల దూరంకూడా బృందంగా వెళ్లేసరికి కష్టంగా అనిపించలేదు.
గర్భగుడికి
చేరేందుకు మాలధారులు మాత్రం పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కవలసి
ఉంటుంది. ప్రతి ఒక మెట్టు మనిషి లో ని ఒక లక్షణానికి
ప్రతీక అని ఒక నమ్మకం. మొదటి అయిదు మెట్లు
పంచేంద్రియాలని, తరువాత ఎనిమిది మెట్లు భావోద్వేగాలకి, ఆ
తరువాత మూడు మెట్లు మానవ గుణాలకి, చివరి రెండు మెట్లు
జ్ఞానం మరియు అజ్ఞానాలకి చిహ్నాలని అంటారు.
పరశురామ నిర్మిత ఈ ఆలయం 1907-1909 మధ్యకాలంలో
అగ్నికి ఆహుతి అవడంతో మరల
పునఃనిర్మించి శిలా విగ్రహానికి బదులు
పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం
పెరిగిందంటారు. ఒక గంట నిరీక్షణతోనే స్వామి దర్శనభాగ్యం కలిగింది. భక్తవత్సలుడి రూపం చూడగానే  జేసుదాసు పాడిన పాట మనసులో మెదిలింది. శ్రితజనప్రియం స్వామి చించితప్రదం
శృతి
విభూషణం
స్వామి
సాధుజీవనం
శృతి మనోహరం స్వామి గీతాలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయ
తర్వాత మాలిగపురంమాత ఆలయం, ఇతరత్రా దర్శించి వెనుదిరిగాం.

గురువాయూర్

గురువాయూరు
కేరళలో అడుగుపెట్టిన తర్వాత మేము దర్శించిన మొదటి
క్షేత్రం.
గతనెలలో శబరిమల వెళ్ళినప్పుడు మేము తక్కువ సమయంలో
ఎక్కువ క్షేత్రాలు దర్శించాలనే నా ఆలోచనతో ఎర్నాకులం వరకు
రిజర్వేషన్ చేయించినప్పటికీ త్రిసూర్ లోనే దిగాం. అక్కడి నుండి
గురువాయూరు, త్రిప్రయార్, బాహుబలి షూటింగ్ చేసిన
అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని శబరిమల వెళ్లాలని అని
నిర్ణయించుకున్నాం. రైలు ఆలస్యం, మాట్లాడుకున్న బస్ కూడా
లేటవడంతోమా ప్లాన్ తారుమారై అనుకున్నవి కాకుండా వేరే చూశాం.
ఆలయం సాయంత్రం 5.30 తెరుస్తారని పెళ్లాం కానీ
సూర్యాస్తమయం తర్వాత దీపాలంకరణ చేసిన తర్వాతే
తెరుస్తారు. కేరళ మందిరాలలో ప్రత్యేకత గర్భగుడి చుట్టూ
ఉండే
వేల దీపాలు, ప్రధాన ద్వారం ముందు ఉండే దీపతోరణాలు.
అలాగే ఇక్కడి ప్రాకారాలు ప్రత్యేకమైన ఆకారం
కలిగిఉంటాయి. ఇతర దక్షిణ భారతదేశ దేవాలయాలలా
గోపురాలు ఉండవు. సాయంత్రం కాగానే ఈ మందిరాలలో
దీపాలన్నిటినీ వెలిగిస్తారు. వీటికి ప్రత్యేకమైన
వ్యవస్థ కూడా ఉంటుంది.
ఓనం పండగ సమయం కావడంతో వేలసంఖ్యలో భక్తులుండడంతో
దర్శనానికి చాలా సమయం పట్టింది. మా తర్వాత ప్రయాణం
త్రిప్రయార్ కు. 8.30కల్లా గుడి మూసేస్తారని ఎంత వేగంగా
వెళ్ళినా 8.35 అయింది. నిరాశే. ఇక వాటరఫాల్స వెళ్దామంటే
రాత్రి కుదరదని నేరుగా శబరిమల బయల్దేరాం

Saturday, 5 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 8

ఇక మాప్రయాణంలో చివరిదైన
మైసూరు... ముందుగా
చాముండేశ్వరి ఆలయానికి
బయలుదేరాం విపరీతమైన వర్షం...
మేం టూర్ బయలుదేరిన 2 వ రోజు
హుబ్లీ ధార్వాడ్ దగ్గర మొదలైన
వర్షం మైసూరు వరకు మమ్మల్ని
వదలలేదు. వర్షం పైగా ఆదివారం
హిల్ రోడ్
మొత్తం ట్రాఫిక్ జాం. ఐనా పోలీసు ల
తొందరగా నే క్లియర్
చేసారు. మహిషాసుర మర్ధిని
చాముండి అమ్మవారి దర్శనం
తొందరగా నే అయింది 100 రూ టిక్కట్
తో. తర్వాత మహారాజ పాలెస్
వెల్లాం. బయటకు వచ్చే సరికి 4.00
అయింది. ఆరోజు
భోజనం అప్పుడయ్యింది. ఇక
బృందావన్ గార్డెన్స్
బయల్దేరగానే మళ్ళీ ట్రాఫిక్ జాం
అన్నారు. అప్పటి కే 7.30 దాటడం
తో చేరుకోలేమని నిరుత్సాహంగానే
వెనుదిరిగి షాపింగ్ చేసుకొని
(రేట్లు మామూలు కంటే చాలా
ఎక్కువే) ఇంటిబాట పట్టాం 8 రోజు
టూర్ ముగించుకొని.

కర్ణాటక యాత్రా విశేషాలు 7

ధర్మస్థల నుండి మైసూరు
బయలుదేరి హసన్ వచ్చే సరికి పడమ
కనుమల నుండి మైదాన
ప్రాంతంకొచ్చాం. హంపి నుండి
గోకర్ణం వెళ్లే దారిలో ధార్వాడ్ దాటిన
తర్వాత మొదలైంది ఘాట్ రోడ్డు. హసన్
దాటి చాలా వరకు రాగానే పెరుగు
కొందామని నేను చెప్పడంతో బస్సు
చిన్న వూల్లో ఆపాం.
(పిల్లలతోఇబ్బంది అవుతుందని
క్యాటరింగ్ వాల్లని వెంట
తెచ్చకున్నాం).
పెరుగును ఏమని అడగాలి అసలే
పల్లెటూరు అనుకున్నా కానీ
నా ఫోన్లో ఉన్న ట్రాన్స్లేటర్
ముసురు అని చూపెట్టింది,
షాపులో ఉన్న 10 సంవత్సరాల కుర్రాడు అది చూసి
మాతో హిందీ లో మాట్లాడడంతో
హమ్మయ్య అనుకున్నా . మా మిగతా
బస్సులు వెళ్ళిపోయాయి. అక్కడి
నుండి కొంత దూరం
వెళ్ళిన తర్వాత 3 రోడ్లు రావడం తో
మావాల్లు ఎటు వెల్లారో
తెలియలేదు. ఇక చూడాలి మా బస్సు
వాల్లు నన్ను చంపేద్దామనేంతగా
నానా గొడవ చేస్తే కొందరేమో ఏం
బాధలేదురా బాబు మన మొత్తం
టూర్ లో అన్నీ వీడు ముందే ప్లాన్
చేస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తాడులే
అన్నారు.(టూర్ మొత్తంలో
రూములు బుక్ చేయడం నుం
ఎక్కడ భోజన , వసతి ఏర్పాట్లు వగైరా.
నీల్లకు మాత్రం చాలా ఇబ్బందైంది.
20 లీటర్ల టిన్ 100 నుండి 300 రూ)
అంతలోనే మా అబ్బాయి ముందు
బస్ లో ఉన్న వాడి ఫ్రెండ్ తో వాట్సప్ లో
గూగుల్ లొకేషన్ తెప్పించకోవడంతో
మావాల్లు శ్రీరంగపట్టణం
వెల్తున్నారని అర్థం
అయింది.అక్కడికి చేరేసరికి రాత్రి 11.00
అయ్యింది. అక్కడ మా బస
గుడి ముందే ఉన్న రంనాథ
కళ్యాణమండపంలో ఏర్పాటు
చేసుకున్నాం. నేను
మరో నలుగురు మిత్రులు పక్కనే
ఉన్న కావేరి నదిలో స్నానానికి పెళ్ళాం,
నీల్లు ఎక్కువ గా లేవు. దైవ
దర్శనం చేసుకున్న
తర్వాత మావాల్లంతా షాపింగ్ లో
మునిగిపోయారు. అన్ని హాం డీ క్రాఫ్
లు ఇక్కడ మైసూరు కంటే సగం
ధర కే లభిస్తాయి. టిప్పు పాలెస్
కూడా చూసి, బయల్దేరాం. ఇక
తర్వాత ప్రయాణం మైసూరు..