Tuesday 21 February 2017

మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు

మాతృభాష ....
మానవుడు పుట్టినప్పటి నుండి సహజంగా (మాతృ
ఒడిలో) నేర్చుకుని మాట్లాడ గలిగే భాష. 
మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా వాటిని
సవ్యంగా అర్ధం చేసుకోవాలంటే మాతృభాష సహకారంతోనే సాద్యం.
మన రెండు రాష్ట్రాల్లో ఎన్నో భాషలు
మాట్లాడేవారు ఉన్నప్పటికీ 90% మంది తెలుగు మాట్లాడేవారే.
కానీ ప్రజలు, పాలకులచే నిరాదరణకు గురై కుమరుగవబోతున్న భాష కూడా తెలుగే. 
ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు
మాధ్యమములోచదువుతున్నారని వినికిడి మరియు లెక్కలు కూడా
తెలియ జెప్పుతున్నాయి.
తెలుగును ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ అని
ఆకాశానికెత్తేశారు హాల్డెన్ అనే విదేశీ దొరగారు. ‘సుందర తెనుంగై’ అని
తెగ మెచ్చుకున్నారు తమిళకవి
సుబ్రహ్మణ్యభారతి. తెలుగువాడిగా పుట్టాలన్నా, తెలుగు భాష మాట్లాడాలన్నా
ఎంతో కొంత పుణ్యంచేసుకునుండాలి. పూర్వజన్మ సుకృతం
ఉంటేకానీ, ఆ మహద్భాగ్యం దక్కదు అని నా అభిప్రాయం. 
ఏబీసీడీల వేడికి తెలుగు పలుకుబడి
మాడిమసయిపోకుండా పాలకులు చర్యలు తీసుకోవాలి.
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో తెలుగును తప్పనిసరిగా మెదటి భాషగా చేసినప్పుడే తెలుగు మనుగడ సాధ్యం. అలాగైతేనే మన ప్రాచీనమైన భాష శాశ్వతంగా భూమిపై నిలిచి ఉంటుంది.

3 comments:

  1. తెలుగు నుడికారపు ఇంపు సొంపులు అలాగే కొనసాగాలంటే మీ లాంటి వారు,మీ వంటి రాతలు ఇంకా ఇంకా రావాలి.నేను కూడా నా వీలైనంత వరకు ఈ విషయం పై పాటుపడతాను....జై తెలుగు....జై జై తెలుగు...

    ReplyDelete
  2. మీ అమ్మాయి quora లో మీ గురించి గొప్పగా చెప్పింది... అదేమిటో చూద్దామని link ని తెరిచాను....చదివిన తరువాత ఇంకా గొప్పగా రాశారనిపించింది......ఇలాగే ఇంకా గొప్ప విషయాలు చెప్పండి... అందరికి తెలియజేయండి.

    ReplyDelete