Tuesday 29 November 2016

పద్మనాభస్వామి ఆలయం తిరువనంతపురం

కొట్టారక్కర నండి చివరగా మేం తిరువనంతపురం బయలుదేరి కొంత దూరం రాగానే భోజనం ముగించుకొని బస్సు ఎక్కాం. ఎక్కడా సరైన మన భోజనం దొరకదు,  పరోటాలే ఆధారం. చల్లని నీల్ల బాటిల్ అడిగితే వింతగా చూస్తున్నారు, అంతటా ఆయుర్వేద మూలికలతో మరిగిస్తున్న నీటినే తాగుతున్నారు. తిరువనంతపురం చేరి హోటల్ రూం తీసుకునేసరికి రాత్రి 12.00 అయింది. ఉదయాన్నే పద్మనాభస్వామి ఆలయానికి బయలుదేరి పెళ్లాం. కేరళ ఆలయాలలో ప్రధానంగా రెండు గుర్తుపెట్టుకోవాలి.
మగవారు చొక్కా/బనీను/ప్యాంటు ధరించరాదు. పంచెలో
మాత్రమే వెళ్ళాలి. ఆడవారు చీర/పంజాబీ డ్రెస్సులో
వెళ్లవచ్చు. మగవారి నిబంధనలు చిన్న పిల్లలకు కూడా
వర్తిస్తాయి. ముందుగానే తెలుసు కాబట్టి పంచె కట్టుకొని బయలుదేరాము.
లేదంటే ఆలయం ముందు కొనుక్కోవచ్చు. చొక్కాలు, పర్సులు, ఫోన్లు క్లాక్ రూంలో పెట్టి లోపలికి వెళ్లాం. కేరళ లో ఎక్కడా కొబ్బరికాయలు కొట్టే సాంప్రదాయం కనిపంచలేదు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం..
అంతులేని సంపదకే కాదు, అనంత మహిమలకూ ప్రతీకనే అంటారు. భారతదేశంలోని 108 వైష్ణవ దివ్య క్షేత్రాలలో 11 కేరళలో ఉన్నాయి. అందులో తిరువనంతపురం పద్మనాభస్వామి ఆలయం ఒకటి. ఆలయం ఒకప్పుడు
"ఎట్టువీట్టిల్ పిల్ల మార్" అనే ఎనిమిది కుటుంబాల వారి
నిర్వహణలో వుండేదిట. తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్
సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని
తన అధీనంలోకి తెచ్చుకుని, 1729 సంవత్సరంలో
పునరుద్ధరించి, ఆలయానికి తామే సమస్తమంటూ ప్రకటించిన నాటినుండి ఇప్పటివరకూ వారి ఆధీనంలోనే ఉంది. ఈ దేవాలయంలో దైవ దర్శనమంటే, ఆదిశేషుడి
మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుడి 18 అడుగుల
మూర్తిని మూడు ద్వారాల నుంచి-ముఖాన్ని దక్షిణ ద్వారం నుండి,
పాదాలను ఉత్తర ద్వారం నుండి, నాభిని మధ్య ద్వారం నుండి
దర్శించు కోవడమే. ఇటీవల కోర్టు ఆదేశంతో ఆలయ నేల మాళిగలలో గదుల నుంచి వెలికి
తీసిన టన్నుల కొద్దీ బంగారం, బంగారు వజ్రా భరణాలు, వజ్ర-
వైఢూర్యాలు, దేవతా ప్రతిమలు, కిరీటాలు, పచ్చ రాళ్లు
పొదిగిన నగలు, పురాతన బంగారు వెండి నాణాలు, కోట్లాది
రూపాయల విలువ చేసే విష్ణుమూర్తి బంగారు విగ్రహం, బంగారంతో
చేసిన ఏనుగు బొమ్మ, కేజీల కొద్దీ ఇతర బంగారు
విగ్రహాలు, వేలాది కంఠాభరణాలు, గొలుసులు,  ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. సంచుల్లో
భద్రపరిచిన 16వ శతాబ్దం నాటి శ్రీ కృష్ణదేవరాయల
కాలం నాణాలు, ఈస్టిండియా కంపెని, నెపోలియన్ కాలాల నాటి
నాణాలు కూడా లభ్యమయ్యాయంటున్నారు. బంగారు గొలుసులు,
బంగారు టెంకాయలు, స్వర్ణ శంఖాలు, తదితర చిత్ర
విచిత్రమైన పురాతన వస్తువులు అక్కడ లభ్యం కావడం
ప్రపంచమంతటినీ విస్మయానికి గురిచేసింది. ఇవన్నీ ఇన్ని
సంవత్సరాలుగా నేలమాళిగలో నిక్షిప్తమై పోయాయి. మానవ
మాత్రులెవ్వరూ, ఇప్పటి వరకు, కనీ వినీ ఎరుగని, కళ్లారా
ఒక్క చోట చూడని "అనంతమైన సంపద", పద్మనాభ స్వామి
ఆలయంలో బయటపడింది.

Monday 28 November 2016

మహాగణపతి దేవాలయం కొట్టారక్కర

మహాగణపతి దేవాలయం కొట్టారక్కర
తిరువనంతపురం బయలుదేరిన మాతో డ్రైవర్ దారిలో మరో ప్రముఖ దేవస్థానం తీసుకెళ్తాననటంతో సరేనన్నాం. అయితే దగ్గర లోనే అనుకున్నాం కానీ దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెద్ద కోనేరు, విశాలమైన మండపాలతో పెద్దగా ఉంది ఆలయం. వాస్తవానికి ఇది శివాలయం కానీ మహాగణపతి దేవాలయం గా ప్రసిద్ధికెక్కింది. పూర్వకాలంలో ఇక్కడి రాజులు శివాలయం నిర్మిస్తున్నపుడు దగ్గరలో ఉన్న పుట్టలోనుండి  మంత్రాలు వినపడడంతో తవ్వి చూడగా వెలసిన గణపతి పేరనే  ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఓనం మాసం కావడంతోమేము వెళ్లిన సమయంలో ఆలయం లో ప్రత్యేక పూజలు జరుతుండడంతో దర్శనానికి అరగంట సమయం పట్టింది.  తూర్పు ముఖంగా శివుడు, దక్షిణ ముఖంగా గణపతి, ఉత్తరంవైపు అయ్యప్ప స్వామి, పడమర వైపు పార్వతిదేవి దర్శనమిస్తారు. బియ్యం, బెల్లం, అరటిపండు, చెక్కర, నెయ్యి, కొబ్బరితో చేసిన మధురమైన ఉన్నిఅప్పం అనే వంటకాన్ని గణపతి కి సమర్పించి ప్రసాదంగా ఇస్తున్నారు. ఇది కేరళ లో చాలా ప్రసిద్ధమైంది.

Tuesday 22 November 2016

మళయాలప్పుజ

అయ్యప్ప సన్నిధి నుండి తిరిగి పంప  చేరుకోవడానికి దాదాపు 3.00 గంటలు పట్టింది. దేవస్థానం వారి వాహనాలు నడిచే రోడ్డుపై కాకుండా మెట్లదారి గుండా దిగాలి, కానీ కొంతమంది రోడ్డు గుండా దిగాం, కానీ సురక్షితంగా లేదు. పంపవద్ద BSNL మాత్రమే పనిచేస్తోంది. అలసిపోయిన మాకు భోజనం ముగించుకొని బస్సు ఎక్కగానే వెంటనే నిద్రపట్టింది. దాదాపు 60 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత చిన్న హోటల్ spicey.com దగ్గర ఆగాం. ఇంత దూరం వచ్చి ఏమీ చూడకుండా వెళ్తున్నామన్న మా మాటలు విన్న  మేనేజర్ మాతో మాట్లాడుతూ దగ్గరలోనే ఉన్న ఆలయం గురించి చెప్పడంతో మళయాలప్పుజ దేవి ఆలయానికి వెళ్లాం. భక్తుల తాకిడి కొంత తక్కువగా ఉంది. అయ్యప్ప దర్శించి వెళ్లేవారు చాలామంది ఇక్కడకు వస్తారట. ఆలయంలోకి ప్రవేశించగానే కుడివైపున స్టాల్ లో ఎర్రని విత్తనాలు  అమ్ముతున్నారు. ఈ  విత్తనాలతో దేవిని పూజిస్తే శత్రు బాధలు నివారింపబడతాయట. తర్వాత మా ప్రయాణం కేరళ రాజధాని తిరువనంతపురంకు.

Tuesday 8 November 2016

శబరిమల

దక్షిణ భారతంలోని పశ్చిమ కనుమలకు చెందిన
దట్టమైన అరణ్యంలో కొండకోనల మధ్య ఉన్న శబరిమలకు బయలుదేరి ఉదయాన్నే 3.30కి  పంపానదికి చేరిన మేము వెంటనే నదీస్నానం చేసి హరిహర సుతుని దర్శనానికి బయల్దేరాం కాలినడకన. నడవలేని వారికి డోలీలు ఉన్నాయి. దేవస్థానం వారి డోలీలైతే మంచిది. 7 కిలోమీటర్ల దూరంకూడా బృందంగా వెళ్లేసరికి కష్టంగా అనిపించలేదు.
గర్భగుడికి
చేరేందుకు మాలధారులు మాత్రం పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కవలసి
ఉంటుంది. ప్రతి ఒక మెట్టు మనిషి లో ని ఒక లక్షణానికి
ప్రతీక అని ఒక నమ్మకం. మొదటి అయిదు మెట్లు
పంచేంద్రియాలని, తరువాత ఎనిమిది మెట్లు భావోద్వేగాలకి, ఆ
తరువాత మూడు మెట్లు మానవ గుణాలకి, చివరి రెండు మెట్లు
జ్ఞానం మరియు అజ్ఞానాలకి చిహ్నాలని అంటారు.
పరశురామ నిర్మిత ఈ ఆలయం 1907-1909 మధ్యకాలంలో
అగ్నికి ఆహుతి అవడంతో మరల
పునఃనిర్మించి శిలా విగ్రహానికి బదులు
పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం
పెరిగిందంటారు. ఒక గంట నిరీక్షణతోనే స్వామి దర్శనభాగ్యం కలిగింది. భక్తవత్సలుడి రూపం చూడగానే  జేసుదాసు పాడిన పాట మనసులో మెదిలింది. శ్రితజనప్రియం స్వామి చించితప్రదం
శృతి
విభూషణం
స్వామి
సాధుజీవనం
శృతి మనోహరం స్వామి గీతాలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయ
తర్వాత మాలిగపురంమాత ఆలయం, ఇతరత్రా దర్శించి వెనుదిరిగాం.

గురువాయూర్

గురువాయూరు
కేరళలో అడుగుపెట్టిన తర్వాత మేము దర్శించిన మొదటి
క్షేత్రం.
గతనెలలో శబరిమల వెళ్ళినప్పుడు మేము తక్కువ సమయంలో
ఎక్కువ క్షేత్రాలు దర్శించాలనే నా ఆలోచనతో ఎర్నాకులం వరకు
రిజర్వేషన్ చేయించినప్పటికీ త్రిసూర్ లోనే దిగాం. అక్కడి నుండి
గురువాయూరు, త్రిప్రయార్, బాహుబలి షూటింగ్ చేసిన
అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని శబరిమల వెళ్లాలని అని
నిర్ణయించుకున్నాం. రైలు ఆలస్యం, మాట్లాడుకున్న బస్ కూడా
లేటవడంతోమా ప్లాన్ తారుమారై అనుకున్నవి కాకుండా వేరే చూశాం.
ఆలయం సాయంత్రం 5.30 తెరుస్తారని పెళ్లాం కానీ
సూర్యాస్తమయం తర్వాత దీపాలంకరణ చేసిన తర్వాతే
తెరుస్తారు. కేరళ మందిరాలలో ప్రత్యేకత గర్భగుడి చుట్టూ
ఉండే
వేల దీపాలు, ప్రధాన ద్వారం ముందు ఉండే దీపతోరణాలు.
అలాగే ఇక్కడి ప్రాకారాలు ప్రత్యేకమైన ఆకారం
కలిగిఉంటాయి. ఇతర దక్షిణ భారతదేశ దేవాలయాలలా
గోపురాలు ఉండవు. సాయంత్రం కాగానే ఈ మందిరాలలో
దీపాలన్నిటినీ వెలిగిస్తారు. వీటికి ప్రత్యేకమైన
వ్యవస్థ కూడా ఉంటుంది.
ఓనం పండగ సమయం కావడంతో వేలసంఖ్యలో భక్తులుండడంతో
దర్శనానికి చాలా సమయం పట్టింది. మా తర్వాత ప్రయాణం
త్రిప్రయార్ కు. 8.30కల్లా గుడి మూసేస్తారని ఎంత వేగంగా
వెళ్ళినా 8.35 అయింది. నిరాశే. ఇక వాటరఫాల్స వెళ్దామంటే
రాత్రి కుదరదని నేరుగా శబరిమల బయల్దేరాం

Saturday 5 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 8

ఇక మాప్రయాణంలో చివరిదైన
మైసూరు... ముందుగా
చాముండేశ్వరి ఆలయానికి
బయలుదేరాం విపరీతమైన వర్షం...
మేం టూర్ బయలుదేరిన 2 వ రోజు
హుబ్లీ ధార్వాడ్ దగ్గర మొదలైన
వర్షం మైసూరు వరకు మమ్మల్ని
వదలలేదు. వర్షం పైగా ఆదివారం
హిల్ రోడ్
మొత్తం ట్రాఫిక్ జాం. ఐనా పోలీసు ల
తొందరగా నే క్లియర్
చేసారు. మహిషాసుర మర్ధిని
చాముండి అమ్మవారి దర్శనం
తొందరగా నే అయింది 100 రూ టిక్కట్
తో. తర్వాత మహారాజ పాలెస్
వెల్లాం. బయటకు వచ్చే సరికి 4.00
అయింది. ఆరోజు
భోజనం అప్పుడయ్యింది. ఇక
బృందావన్ గార్డెన్స్
బయల్దేరగానే మళ్ళీ ట్రాఫిక్ జాం
అన్నారు. అప్పటి కే 7.30 దాటడం
తో చేరుకోలేమని నిరుత్సాహంగానే
వెనుదిరిగి షాపింగ్ చేసుకొని
(రేట్లు మామూలు కంటే చాలా
ఎక్కువే) ఇంటిబాట పట్టాం 8 రోజు
టూర్ ముగించుకొని.

కర్ణాటక యాత్రా విశేషాలు 7

ధర్మస్థల నుండి మైసూరు
బయలుదేరి హసన్ వచ్చే సరికి పడమ
కనుమల నుండి మైదాన
ప్రాంతంకొచ్చాం. హంపి నుండి
గోకర్ణం వెళ్లే దారిలో ధార్వాడ్ దాటిన
తర్వాత మొదలైంది ఘాట్ రోడ్డు. హసన్
దాటి చాలా వరకు రాగానే పెరుగు
కొందామని నేను చెప్పడంతో బస్సు
చిన్న వూల్లో ఆపాం.
(పిల్లలతోఇబ్బంది అవుతుందని
క్యాటరింగ్ వాల్లని వెంట
తెచ్చకున్నాం).
పెరుగును ఏమని అడగాలి అసలే
పల్లెటూరు అనుకున్నా కానీ
నా ఫోన్లో ఉన్న ట్రాన్స్లేటర్
ముసురు అని చూపెట్టింది,
షాపులో ఉన్న 10 సంవత్సరాల కుర్రాడు అది చూసి
మాతో హిందీ లో మాట్లాడడంతో
హమ్మయ్య అనుకున్నా . మా మిగతా
బస్సులు వెళ్ళిపోయాయి. అక్కడి
నుండి కొంత దూరం
వెళ్ళిన తర్వాత 3 రోడ్లు రావడం తో
మావాల్లు ఎటు వెల్లారో
తెలియలేదు. ఇక చూడాలి మా బస్సు
వాల్లు నన్ను చంపేద్దామనేంతగా
నానా గొడవ చేస్తే కొందరేమో ఏం
బాధలేదురా బాబు మన మొత్తం
టూర్ లో అన్నీ వీడు ముందే ప్లాన్
చేస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తాడులే
అన్నారు.(టూర్ మొత్తంలో
రూములు బుక్ చేయడం నుం
ఎక్కడ భోజన , వసతి ఏర్పాట్లు వగైరా.
నీల్లకు మాత్రం చాలా ఇబ్బందైంది.
20 లీటర్ల టిన్ 100 నుండి 300 రూ)
అంతలోనే మా అబ్బాయి ముందు
బస్ లో ఉన్న వాడి ఫ్రెండ్ తో వాట్సప్ లో
గూగుల్ లొకేషన్ తెప్పించకోవడంతో
మావాల్లు శ్రీరంగపట్టణం
వెల్తున్నారని అర్థం
అయింది.అక్కడికి చేరేసరికి రాత్రి 11.00
అయ్యింది. అక్కడ మా బస
గుడి ముందే ఉన్న రంనాథ
కళ్యాణమండపంలో ఏర్పాటు
చేసుకున్నాం. నేను
మరో నలుగురు మిత్రులు పక్కనే
ఉన్న కావేరి నదిలో స్నానానికి పెళ్ళాం,
నీల్లు ఎక్కువ గా లేవు. దైవ
దర్శనం చేసుకున్న
తర్వాత మావాల్లంతా షాపింగ్ లో
మునిగిపోయారు. అన్ని హాం డీ క్రాఫ్
లు ఇక్కడ మైసూరు కంటే సగం
ధర కే లభిస్తాయి. టిప్పు పాలెస్
కూడా చూసి, బయల్దేరాం. ఇక
తర్వాత ప్రయాణం మైసూరు..

Friday 4 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 6

ధర్మస్థల చేరేసరికి బాగా రాత్రి
అయ్యింది. ఇక్కడ పెద్దగా
ప్రయివేటు హోటల్ లు లేవు అన్ని
దేవస్థానం వారివే. మాకు ఇక్కడ వసతి
వెంటనే దొరికింది (గంగోత్రి కాటేజి)
మేం వెళ్ళిన మొత్తం టూర్ లో ఇక్కడే
తక్కువగా ధర రూములకి . ఆలయ
అద్భుతంగా కేరళ ఆలయాల
రీతిలో ఉంది. దాదాపు గా తిరుపతి లో
ఎలా నిర్వహణ ఉంటుందో అలాగే
ఉంది. ఇక్కడ ఆలయంలో గత 800 సంవత్సరాలుగా నిరాటంకంగా అన్నదానం సాగుతోందట.కర్ణాటక లోని దాదాపు అన్ని
ఆలయాలలో భక్తులకు అన్నదానం
నిర్వహిస్తున్నారు. ఆటోలోకల్ 10 రూ
తీసుకుంటారు. కానీ కాస్త దూరం
ఉండే రామాలయానికి 300
తీసుకున్నారు ముగ్గురికి.
వాస్తవానికి జీపు లాంటిది 400
కే వచ్చింది. రెండు చూడదగిన
మ్యూజియంలుకూడా
ధర్మస్థలలో ఉన్నాయి. పరుగెత్తించే
మన జీవితంలో ఆగి ఆస్వాదించాల్సినవి
ఎన్నో ఉన్నాయనిపించింది. మా
తరువాతి ప్రయాణం
ఇండియన్ హెరిటేజ్ సిటీ మైసూరు
కు.

Thursday 3 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 5

10 గంటల కల్లా ఉడిపి లో దర్శనం
పూర్తి చేసుకున్న మేము మరో
గంటలో శృంగేరికి బయలుదేరాం.
ఆగుంబే మీదుగా ఘాట్ రోడ్ డ్రైవింగ్
కష్టం అని అక్కడి వాల్లు చెప్పడం
తోకర్కాల మీదుగా 30 కిలోమీటర్ల
దూరం ఎక్కువైనా అలాగే వెల్లాం .
పూర్తిగా అడవి తో నిండిన ఘాట్
రోడ్ కావటం తో మేం శృంగేరి చేరేసరి
సాయంత్రం 3.00
అయింది. బస్సులోనుండి కాలు
కింద పెట్టగానే ఒక చిరుజల్లు
ముఖాన్ని తాకింది. గొడుగు
తీసుకుని శారదాపీఠానికి బయల్దేరాం.
ఆదిశంకరులు అద్వైతం
ప్రచారం చేయడానికి నెలకొల్పిన
నాలుగు మఠాలలో తుంగా తీరంలో ని
శృంగేరి శారద మఠం మెదటిది. గంగా
స్నానం తుంగా పానం రెండూ
అంతే గొప్పవని అక్కడివాల్లు
చెప్పారు. నీల్లు స్వచ్చంగా
ఉన్నాయి.ముందుగా శారదామాత
ఆలయం దర్శించుకున్నాం,
పురాతన ఆలయం అగ్నికి ఆహుతి
కావడంతో పునః నిర్మించారట. ఇక్కడ చాలా
మంది స్త్రీ లు అమ్మవారి కి ఒడి
బియ్యం, చీరెలను
సమర్పిస్తున్నారు.
తరువాత విద్యాశంకర ఆలయాన్ని 5.00
గంటల కు తెరచినాక దర్శించాం,
ఇదొక సైన్సు అద్భుతం.
సూర్యుడు రాశులు
మారినప్పుడల్లా కిరణాలు ఒక్కో
స్థంభం పైన మార్చి పడుతాయట.
ఆరోజు మఠంలో స్వామివారి దర్శనం
లేదనడంతోనది అవతలి వైపున ఉన్న
గురు నివాస్ కి వెళ్లకుండానే
ధర్మస్థలకు మా ప్రయాణం
ప్రారంభించాం. ఇక్కడ వసతి కోసం
టిటిడి వారి భవనం కూడా ఉంది.
ఇక్కడ పోలీసు వాల్లు పెట్టిన బోర్డు
చూడండి.

కర్ణాటక యాత్రా విశేషాలు 4

మురుడేశ్వర్ నుండి బయలుదేరి
మేము బత్కల్ దగ్గర
భోజనం ముగించుకొని ఉడిపి
చేరేసరికి రాత్రి 11.00 అయింది.
దేవాలయం ఎదురుగా హోటల్ మధుర
లో రూం తీసుకున్నాం (600రూ)
బాగుంది. ఉదయాన్నే 6.00 గంటలకు
ఆలయానికి వెళ్ళాం. 7.00 గంటలకు
స్వామి వారి అలంకరణ కోసమని
క్యూలైన్ని లిపివేయడంతో పక్కనే
ఉన్నచంద్రమౌళీశ్వర ఆలయాన్ని,
దర్శించుకొని మళ్ళీ వరుసలో నిలబ
అరగంట లో ఆలయం లోకి
పెళ్లాం. అచంచల విశ్వాసం కలిగిన
భక్తుని కోసం
భగవంతుడు దిగివస్తాడనేందుక
ఈ ఆలయం నిదర్శనం.
నిమ్నజాతికులస్థడైన కనకదాసుకు
ఆలయ ప్రవేశం
అనుమతించకపోవడంతో అతని కోస
శ్రీకృష్ణ భగవానుడు
పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు
ఇక్కడి స్థల పురాణాలుచెప్తున్నాయి. ఆ
కారణంగానే ఇక్కడ దేశంలో ఎక్కడా లేని
విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ
దర్శనం ఉండదు. స్వామివారిని
కిటికీగుండా మాత్రమే
దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర
కిటికీ అని పిలుస్తారు. ఇక్కడ ఈ
దేవాలయ సింహద్వారం
తూర్పుముఖంగా ఉన్నప్పటికీ
స్వామివారు మాత్రం
పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు.
ఎంత చూసినా తనివి తీరని స్వామి
వారి దివ్యమోహన రూపాన్ని మనసున
నిలుపుకొని ముందుకు కదిలాం .

కర్ణాటక యాత్రా విశేషాలు 3

గోకర్ణం నుండి మురుడేశ్వర్ 80
కిలోమీటర్లే ఐనా రోడ్ ఇప్పుడే నాలుగ
లేన్ల హైవే గా మారుస్తుండడం,
రద్దీ ఎక్కువ గా ఉండడంతో
దాదాపుగా 3 గంటల
సమయం పట్టింది.అరేబియా
తీరంలోని పంచ శైవ క్షేత్రాలో
మురుడేశ్వర్ ఒకటి.
ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోయిన
రావణుడు ఆత్మలింగాన్ని
తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం
వైపు నుంచి లాగడంతో అది
విసురుగా వెళ్ళి దూరంగా
పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర
లింగం వెలుస్తుంది. పెట్టె
మూతపడిన చోట గుణేశ్వర లింగం
ఉద్భవిస్తుంది.
లింగంపై కప్పబడిన వస్త్రం పడిన
చోట మురుడేశ్వర లింగం
వెలుస్తుంది. పెట్టెను కట్టిన
(తాళ్ళు) పడినచోట
ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది.ఈ
లింగాల మధ్య స్వామివారి
ఆత్మలింగం మహాబలేశ్వరలింగం
గోకర్ణంలో వెలుస్తుంది.
ఆత్మలింగంతో ముడిపడిన
ఐదుక్షేత్రాలను శైవ
పంచక్షేత్రాలని పిలుచుకుంటారు
కర్ణాటకలో. మురుడేశ్వర్ ఆలయ
గోపురం ప్రపంచం లోనే పెద్దదిగా
చెప్పవచ్చు. 18 అంతస్తులు.
సముద్రం మధ్యలో దీవిపై
మహాశివుని అతి పెద్ద విగ్రహం
ఇంకా అద్భుతం. ఇక్కడి నుండి
తర్వాతి ప్రయాణం ఉడిపి కి.

Tuesday 1 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు1

విజయనగర రాజులు కట్టించిన
ఆలయాల నగరం (విజయనగరం)
హంపి ఎన్నో రోజులుగా
చూడాలనుకున్న కల నెరవేరింది.
శిథిల నగరంగా కనిపించే హంపి
యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో
చోటు సంపాదించుకుంది.
కనిపించే ప్రతి రాయిలోను దేవుడి ని
చూసే హిందువులకు
మహమ్మదీయుల దాడిలో ఇక్కడి
కూల్చివేసిన ఆలయాలు, విరగ్గొట్టిన
విగ్రహాలు బాధ కలిగిస్తాయి. అద్భు
ఆలయాలు, శిల్పాలు ఉన్నప్పటికీ
విరూపాక్ష ఆలయం లో మాత్రమే
పూజలు నిర్వహిస్తున్నారు.
ఎందుకంటే మిగతా విరిగిన
విగ్రహాలను పూజించడం
హిందూ సాంప్రదాయం కాదు
కాబట్టి. మొన్నామధ్య కోర్టు
మొట్టికాయలు వేసేదాకకూడా కర్ణాటక
ప్రభుత్వం పెద్దగా సంరక్షణ,
అభివృద్ధి పనులు
ప్రారంభించలేదు. హంపి లో బస
చేసేందుకు సౌకర్యాలు తక్కువ,
దగ్గర లో ఉన్న కమలాపురం,
హోస్పేటలోనే చూసుకోవాలి. హంపి
గురించి పూర్తిగా తెలియాలంటే
ఖచ్చితంగా గైడ్ ను
మాట్లడుకోవలసిందే. (500 రూ)
పూర్తి గా హంపి చూడాలంటే ఆటో
(500రూ) మాట్లాడుకోవడం మంచిది. ఇంకా సైకిల్ లు, జట్కా  బండ్లు కూడా అద్దెకు దొరుకుతాయి.
మా గైడ్ ఉదయం 8 గం లకు హంపి
సందర్శన ప్రారంభించి
ముఖ్యమైన విఠల ఆలయం,
(మేము వెళ్ళినపుడు విఠల
ఆలయంలో పునరుద్దరణ పనుల
చేస్తున్నందున సందర్శనకు
పూర్తిగా అనుమతించలేదు ,) కోట,
లోటస్ మహల్, ఉగ్ర నరసింహలాంటి
ముఖ్యమైన ప్రదేశాలను చూపిం
మద్యాహ్నంకల్లా ముగించాడు..కా
పూర్తి గా చూడాలంటే కనీసం 3
రోజులైనా సరిపోదని చెప్పాడు. కర్ణాటక
టూర్ లో 1 వ రోజు ఇలా పూర్తి
అయింది.

కర్ణాటక యాత్రా విశేషాలు 2

ఇక హంపి నుండి మా ప్రయాణం
నేరుగా త్రిశైవ క్షేత్రాలో ఒకటి అయిన
ఆత్మలింగ క్షేత్రం గోకర్ణంకు.
(మిగతా రెండు కాశీ, రామేశ్వరం ) 2వ
రోజు ఉదయం 4 గంటల కల్లా చేరిన
మేము హోటల్ రూం తీసుకుని ,
స్నానాదులు ముగించుకొని
8గంటలకు ఆలయాని బయలుదేరి
పెళ్ళిన మాకు ముందుగా
వినాయకుడిని దర్శించుకోవాలని
చెప్పడంతో బాలగణేశుడిని
దర్శించుకొని ప్రధానాలయం లోకి
వెళ్లే సరికికాస్త రద్దీగా ఉన్నప్పటికీ
1గంటలోనే అభిషేకం పూర్తి చేసుకొ
బయటకు రావడంతోనే పూజారుల
ద్వారా క్షేత్రం లో పిండప్రదాన
ప్రాధాన్యత తెలుసుకొని మిత్రులతో
కోటితీర్థం వెళ్ళాము. (గుడి నుం
అరకిలోమీటర్) ఇక్కడ గడిలోనూ,
కోటితీర్థం దగ్గర తెలుగు మాట్లాడే
పూజారులు ఉన్నారు, కాబట్టి
ఇబ్బంది పడలేదు. మా పిల్లలు
మాత్రం సరదాగా బీచ్ వైపు వెళ్ళారు.
ఇక్కడ నుండి మధ్యాహ్నం 1
గంటకు బయలుదేరిన
మేము సమయాబావం వలన
కొల్లూరు మూకాంబిక ఆలయానికి
వెళ్ళగలమా లేదా అనుకుంటూనే
మురుడేశ్వర్ బాట పట్టాము.