Tuesday, 3 October 2017

ఎవరి భాష వారికి గొప్ప

దసరా పండగ ముందు కాస్త  బిజీగా ఉండటంవల్ల
అప్పుడు రాద్దామనుకున్నా పోస్టు కొంచం లేటయ్యింది.
ఒక ఇరవై రోజుల క్రితం శ్రీకాకుళం నుండి
ఒక మిత్రుడు ఫోన్ చేసి మాట్లాడుతూ మధ్యలో 
నా బ్లాగు చూసినట్టు, అందులో
 పోస్టులు  జీలకర్ర బెల్లం లేకుండా పెళ్ళి ,   డబుల్ డెక్కర్ బస్సు చదివి
భలేగా రాసావురా కాలేజి రోజులు గుర్తుకొచ్చాయిరా
నేనుకూడా ఒకట్రెండుసార్లు మీతో కలిసే
డబుల్ డెక్కర్ లో అమీర్పేట్ నుండి
సికింద్రాబాద్ వచ్చినట్టు గుర్తు అన్నాడు.
కొంతసేపు మాట్లాడాక సడెన్ గా
అయినా  మీకు తెలంగాణ వచ్చాక పూర్తిగా
భాష మారిపోయిందా? అల్లాంటి భాష  రాసావు అన్నాడు.
మా భాష అంతేకదా ,
మేము అలాగే  మాట్లాడుతాము కదా
అన్నాను . అవునూ  రెండేళ్ళు కాలేజి చేసినవ్,
ఐనంక  ఓ ఐదేళ్ళు వరంగల్ లో నౌకరి చేసినవ్
మా భాష నేర్సుకోలేదా అనగానే,
ఔరబై మస్తు యాది ఉంది అన్నాడు
అదీ అలాగుండాలి
 ఆదరణ కోల్పోతూ ఒక 
పల్లెటూరి భాషగా మిగిలిపోతున్న
 ప్రపంచ  భాషలలో కెల్లా గొప్పదైన 
తేనే లాంటి మన తెలుగులో 
ఎన్నో మాండలికాలు  అందులో తెలంగాణా యాస ఒకటి 
నా యాస నాకు గొప్ప మాకాడ గిట్ల మాట్లాడుతేనే అర్ధం ఐతది