Friday, 31 March 2017

ఫూల్ ఎవడు???
ఏప్రిల్ ఒకటి నాడు కొంతమంది  ఫూల్స్ డే జరుపుకోవడం
ప్రతిఒక్కరు  దానికి తమవంతు కృషిగా 
మెసేజ్ తయారుచేసి పంపటం.. 
ఖర్మరా బాబు .....

ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం 
వసంత బుుతువులోనే (ఉగాదినాడు)
ప్రారంభమయ్యేది మనకు లాగే.
 (అంతెందుకు బైబిల్ లోని ""ఎజ్రా "" పుస్తకం 10:17 వ వచనం
 సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో
ప్రారంభమౌతుందని తెలుపుతోంది)

            క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో
ఫ్రాన్స్ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ
 11 వ నెలగా ఉన్నజనవరి ని ఒకటవ నెలగా
 నూతన సంవత్సరం గా ప్రారంభించాడు.ఈ
విధంగా నేటి మన నూతన సంవత్సరం ప్రారంభమైంది.
ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు.
 అసలు ఎందుకు మార్చాడో తెలియదు. కానీ సంవత్సరం
ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని 
ఆలోచించిన కొంత మంది రాజు దృష్టి కి తేవడంతో మార్చాడంటారు.
రాజాగ్నతో చాలామంది జనవరి కి మారినప్పటికీ కొందరు ఏప్రిల్లోనే
 నూతన సంవత్సరం జరపుకుంటూ ఉండడంతో వాల్లను
 ఫూల్స్ గా అవహేళన చేయడంతో ప్రారంభ మైంది ఫూల్స్ డే. 
15 వ శతాబ్దంలోనే యూరప్ మొత్తం ఈ విధానం లోకి మారినా
 ఆసియా లోమాత్రం 20వ శతాబ్దంలో బ్రిటిష్ పాలన వల్ల మార్చబడింది.
కానీ ఏ కాలంలోనైనా ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కాలమానానికి
"ఖగోళమే" ఆధారం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. 
అట్టి కాలమానంలోని
అంశాలన్నింటిని పూర్తిగా ఖగోళ శాస్త్ర  రీత్యా ఏర్పాటు
చేసుకున్న ఏకైక జాతి హిందూ జాతి. కాలమాన అంశాలైన రోజు, వారం,
పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరం మొదలైన అన్నింటినీ
 ప్రాచీన కాలం నుంచి హిందువులు ఖగోళ
శాస్త్ర  ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు.
దాని ప్రకారమే హిందువులు నూతన సంవత్సరం జరుపుకుంటారు. 
(ప్రపంచమంతా కూడా  జరుపుకోవాలి )
మొన్ననే ఉగాది జరుపున్న నేను మాత్రం ఫూల్ ను  కాదు 
ఇక ఇప్పుడు  చెప్పండి ఎవరు ఫూల్స్....

షోరూమ్స్ కి పరుగో పరుగుBS3 వాహనాలపై మొన్నటి సుప్రీం తీర్పుతో
ఉక్కిరిబిక్కిరయిన ఆటోమొబైల్ కంపెనీలన్నీ
ఏమి పాలుపోక ఒక్కసారిగా ఆఫర్లతో ఊదర గొట్టాయి.
దీంతో టు వీలర్ కొనాలకున్న, మార్చాలనుకున్న
 నాలాంటి  చాలామందిమధ్యతరగతి ప్రజలు
 ఒక్కసారిగా షోరూమ్స్ కు పరుగందుకున్నారు
పాపం అందరికి వాహనాలు దొరకక నిరాశతో
చాలామంది వెనుదిరగవలసివచ్చింది .
వాస్తవానికి నిన్ననే నా మొబైల్ కి మెస్సేజ్ వచ్చింది.
కాని ఎప్పుడు స్పీడ్ గా ఉండే నేను కాస్త అలక్ష్యం చేయటంతో
నన్ను కూడా షోరూమ్స్ ముందు నో స్టాక్ బోర్డ్ వెక్కిరించింది .
ఏం చేస్తాం ఇప్పుడున్న బండి తోనే
ఇంకా కొన్ని సంవత్సరాలు నేట్టుకురావాలి.

Tuesday, 28 March 2017

ఉగాది శుభాకాంక్షలు

మావిచిగురు, వేపపవ్వు,
మల్లెల గుబాళింపులు,
కోయిల కుహూరావాలు....
ఉగాది రాకకు సంకేతాలు.
ప్రకృతితో ముడిపడి ప్రతి జీవికి చైతన్యంతో కూడిన ఆనందాన్ని,
ఉల్లాసాన్ని
కల్గించే పండగ ఉగాది.
అచ్చంగా జీవితం
మనకి చూపించే రకరకాల
రుచులకు మల్లే 
తీపి, కారం, చేదు, ఉప్పు,
పులుపు, వగరు ఇత్యాది రుచుల సమ్మేళనమైన
ఉగాది పచ్చడిని ఆస్వాదిస్తూ పలుకుదాం కొత్త సంవత్సరానికి ఆహ్వానం ......
అందరికీ హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

Monday, 20 March 2017

కులం గోడలు కూల్చాలంటే !

ఇపుడే whatsappలో ఒక మెసేజ్ వచ్చింది
చూస్తేఒక video.
 చాలారోజుల క్రితంది లాగుంది ఫార్వర్డ్ అవుతూ అవుతూ 
ఇవ్వాల  నాకు చేరింది.
దాని సారాంశం వయసోచ్చినవాల్లంతా ఇతర 
కులాలకు చెందిన వారిని పెళ్లి చేసుకొని ఇంటికి 
తీసుకురండి కుల సమస్య తీరిపోతుంది అని ...
   ఎలాసాధ్యం?    నాకర్థం కాలేదు.
ఏ రెండు కులాల ఆచార వ్యవాహారాలు కాని 
ఆహార విహారాలు కాని ఒకేలా ఉండవు
 సమస్య తీరిపోవటం కాదుకదా
 ఎన్నో కొత్త సమస్యలు పుట్టుకు వస్తాయి .
ఆర్ధిక అసమానతలు రూపుమాపబడినప్పుడే 
కుల వివక్ష పోతుంది అని నా ఉద్దేశం.
కులం గురించి అడగడం, చెప్పటం కూడా
రాజ్యాంగ సమ్మతమే కదా 
కుల ప్రాతిపదికనే ఎలక్షన్లో సీటును కేటాయిస్తారుకదా.
విద్యా, ఉద్యోగాలలోనూ కులమే కదా ప్రాతిపదిక.
మన ప్రభుత్వాలే కుల పునాదుల మీద నిలబడి ఉంటున్నాయి 
మా కులం వాడు బాగు పడాలి అనుకోడంలో తప్పేముంటుంది , 
వేరే కులంవాడు నాశనం కావాలనుకుంటే తప్పుకాని. 
యువతను కులాంతర వివాహాల దిశగా ప్రోత్సహించేకంటే 
కులనిర్మూలన దిశగా ప్రభుత్వానికి సలహా ఇస్తే బాగుండేది ఆ నాయకుడు .
కులం పేరుతొ ప్రజలను రెచగొట్టి పబ్బం గడుపుకుంటున్న
రాజకీయ పార్టీలను వదిలి కాలేజి యువతకు
 ఇలాంటి సందేశాన్ని ఎందుకిచ్చాడో?

Sunday, 12 March 2017

ఒక్కో అడుగు దివాలా వైపు


ఒరేయ్ ఎల్లయ్య!
మొన్న కొన్ని గొర్లు అమ్ముతే వచ్చిన
 రొండు లచ్చలు బ్యాంకుల ఎయ్యాలెరా
 జర  వత్తవా బ్యాంకుకు.
అరే! మల్లిగా....
నీకు దెల్వదా  ఇప్పుడు బ్యాంకుల
పైసలు ఏసినా తీసినా మనకు చార్జి పడుతదట.
ఇంగో గట్ల గాదుగని మన సావుకారి దగ్గర పెడుదాంర
వడ్డికీ వడ్డీ ఇస్తడు పైసలుగూడ ఎప్పుడంటే గప్పుడు ఇస్తడు.
కార్పోరేట్ కంపెనీలకు రెడ్ కార్పెట్ పరిచే మన బ్యాంకులు
 సామాన్యులంటే చులకనగా చూస్తూ
 సవాలక్ష నిబంధనలు
నెలకు ఇన్ని లావాదేవీలే, మినిమం బ్యాలెన్సు
 ఇంత అంటూ పెడుతున్నాయి.
అదే సామాన్యుడికి మండితే బ్యాంకుల్లో ఉన్న డబ్బంతా
 ఒక్కసారిగా తీసుకుంటే పరిస్థితేంటి .మార్చిలో టార్గెట్ చేరుకోలేక
 రేటింగ్ పడిపోయి దివాలతీయవా?
సామాన్యులు చేసే డిపాజిట్లను వడ్డీలకు తిప్పుకుంటూ
 బతికే బ్యాంకులువాళ్ళకే ఇలా   అర్థం పర్థం లేని
 నిబంధనలు పెడితే ఎలా
మోడీ ఎఫెక్టు తో  ఒక్క నెల బ్యాంకులు కలకలలాడగానే కళ్ళునెత్తికెక్కాయ?
పూర్తిగా డిజిటల్ పేమెంట్ దిశగా అడుగులు వేద్దామన్న
 తరుణంలో ఇటువంటి నిర్ణయాలు శరాఘాతాలే. ఇప్పటికైనా  RBI
  పునరాలోచించుకోవాలి . కస్టమర్లు పోస్తాఫిసులవైపు
 వెళ్ళకముందే కల్లు తెరుస్తే మంచిది .
ఇప్పటికే చాలామంది paytm లాంటి Ecomerce సైట్లు  వాడు తున్నారు.
ఇక అందరూఅటువైపు వెళ్తే బ్యాంకులు జీతాల టైంలో తప్ప ఇంక వాడరు.
అప్పుడు దివాళాతీయక తప్పదు.
కాబట్టి ఏ నిర్ణయమైనా సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే బాగుంటుంది .
చూద్దాం ఏంజరుగుతుందో.......

హోళీ శుభాకాంక్షలు

అద్భుతమైన రంగుల పండుగ...
విశ్వవ్యాప్యంగా జరుపుకుంటున్న వేళ
మిత్రులందరికీ
వసంతోత్సవ శుభాకాంక్షలు

Wednesday, 8 March 2017

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు


ఎప్పుడూ అమ్మో,
భార్యో, కూతురో తోడు లేనిదే జీవితాన్ని కొనసాగించలేని
ఈ పురుష ప్రపంచానికి ఒక్క మాట ........

        పురుషాధిక్య  భావజాలానికి స్త్రీ
పురుషులిరువురూ అలవాటు పడ్డ ఈ సమాజంలో మార్పు రావాలి.
 అలా అని కేవలంస్త్రీలపై హింస తగ్గిపోవడంతోనే
కాకుండా సమానతను కల్పించాలి.
ప్రకృతిలో సంఖ్య లోనూ,
సాధికారతలోనూ స్త్రీ పురుషుల సమతుల్యతకి
ఆవశ్యకమైన మార్పు రావాలి.
స్త్రీలపై అత్యాచారాలూ, పుట్ట బోయే ఆడపిల్లల
భ్రూణ హత్యలూ , యాసిడ్ దాడులూ, 
వరకట్న మరణాలూ లేని సమాజం నిర్మితమవ్వాలి.
         
           తల్లిలా,చెల్లిలా,చెలిలా నెచ్చెలిలా,కూతురిలా ఇలా
ఎన్నో ఎనెన్నో రూపాలతో ఈ సృష్టి కే సృష్టి కర్తలైన స్త్రీ మూర్తులందరికీ
మహిళాదినోత్సవ శుభాకాంక్షలు

Tuesday, 7 March 2017

ప్రజల చేతికి బ్రహ్మాస్రాలు

ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం మనది.
సవరణలు కూడా ఎన్నో ...
మారుతున్న కాలానికనుగుణంగా భారత ప్రజల
జీవితాలను మెరుగు పరిచేందుకు ఎన్నో
చట్టాలను
అమలులోకి తెచ్చిన ప్రభుత్వం
ఇప్పుడొక కొత్త బిల్లును తెచేందుకు
సమాయత్తమవుతోందట .
ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడిని నచ్చకపోతే
దించేసేఅధికారం ప్రజలకుఇవ్వబోతోందట.
అదే గనక జరిగితే ఏ రాజకీయ నాయకుడైన
ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని
చేయవలసిందే.
ప్రజలకు ఇదివరకే అందించబడిన
వజ్రాయుధం RTI
సమాచారహక్కు చట్టం, ఇప్పటికే చాలామట్టుకు
ప్రభావం
చూపెడుతోంది .దీనికి తోడు ఈ రీకాల్ చట్టం
కూడా వస్తే
వెధవ వేషాలు వేసే నాయకులను దించేసి ,
మంచి పరిపాలనాదక్షత కలిగిన నిజాయతీ కలిగిన
నాయకులను
గద్దేనేక్కించ వచ్చు.