Saturday, 4 February 2017

భయపడుతున్న భారతం

గత వారం రోజులుగా టివి, పేపర్లు పరిశీలిస్తే ఇండియా కి ఏదో అవుతోందనుకోవడం ఖాయం.
భారతదేశ జనాభా లో ఒక్క శాతం మాత్రమే అమెరికా లో నివసిస్తున్నారు.
అమెరికా అధ్యక్షునిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిననాటి నుండి మీడియా లో రోజుకో కథనం.. విదేశీయులందర్ని వెనక్కి పంపిస్తారని.
విదేశీయుల్ని వెనక్కి పంపినా, రాకుండా అడ్డుకున్నా అమెరికా మనగలదా.
ప్రస్తుత అమెరికాలో ఇతర
దేశాల నుంచి వచ్చిన వారే 15 శాతం
మంది ఉన్నారు.
అమెరికాలో దాదాపు 25 శాతం చిన్న
వ్యాపారులు ఇతర దేశాల నుంచి
వచ్చిన వారే. వీరు బయటకు
వచ్చేస్తే.. అక్కడి పారిశ్రామిక రంగం
కుప్ప కూలిపోదా.
అమెరికాలో 25 శాతం కంపెనీలను వలస వచ్చినవారే స్థాపించారు. గూగుల్, ఈబే,
యాహూ, సన్ మైక్రోసిస్టమ్స్,
ఫేస్బుక్, ఇంటె ల్ కూడా వలసవాదులవే కదా..
ఈ కంపెనీలు లేకుంటే.. అమెరికా నంబర్ వన్ గా ఉంటుందా.
ఏ నాయకుడైనా తమవారే బాగుపడాలనుకోవడం సహజం ట్రంప్ కూడా అదే చేస్తాడు. వలస వచ్చే వారికి నిబంధనలు కఠినం చేస్తాడు కానీ పూర్తిగా వలసలను నిషేధించలేడు.
వలసవాదులే
లేకుంటే మేం ఈ 21వ
శతాబ్దంలో నం.1 అయ్యేవాళ్లమే
కాదు అని గతంలో ఒబామానే స్వయంగా అన్నారు.
స్వయంగా వ్యాపారవేత్త అయిన ట్రంప్ కు ఇవన్నీతెలియదా..
తెలిసీ తమ సూపర్ పవర్ ను రిస్క్ లో పెడతాడా. 
మన టీవీ చానెల్ లు చెప్తున్న్ట్టట్టు ఏదో జరుగుతుందా.. 
కొన్నాళ్ళు ఆగితే కానీ అందరి అనుమానాలు తీరవు.

No comments:

Post a Comment