ఇక వరంగల్ నుండి మేడారం వెళ్లే ముందే నిర్ణయించుకోవలసిన విషయం...
ఈ రెండు రూట్లలో ఎటువైపు నుండి తిరుగు ప్రయాణం అని..
1. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తే మొదట లక్నవరం సరస్సు, తర్వాత రామప్ప, ఘణపురం కోట గుళ్లు, కాళేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టు, పాండవుల గుట్టలు (trekking)
2. ఏటూరునాగారం అభయారణ్యం (site seeing),
మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, వాజేడు జలపాతం, పర్ణశాల, భద్రాచలం
మేడారం నుండి తిరుగు ప్రయాణ మార్గంలో చల్వాయి నుండి 8 కిమీ దూరం లో ఉన్న లక్నవరం సరస్సు చూడొచ్చు. సాధారణంగా కాకతీయుల నిర్మాణాలు సరస్సు, జనావాసం, దేవాలయం అనే ప్రాధాన్యం గా ఉంటాయి. కానీ ఇక్కడ కేవలం సరస్సు మాత్రమే నిర్మించారు. అక్కడి నుండి ప్రపంచ ప్రఖ్యాత యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన కట్టడం పాలంపేటలోని రామప్ప దేవాలయం 30 కిమీ. ఇక పక్కనే 15 కిమీ దూరంలో ఘణపురం కోట గుళ్ళను చూడొచ్చు.
తర్వాత కాళేశ్వరం వెళ్లాలనుకుంటే 80 కిమీ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది ఇక్కడే.
లేదు ఘణపురం నుండి తిరిగి వెళ్లాలనుకుంటే మార్గమధ్యలో ద్వాపరయుగంలో పాండవులు వనవాసం చేసిన గుహలు, లక్కమేడలు చూసి (ఇక్కడ సేద తీరేందుకు , పర్వతారోహణ కుపర్యాటక శాఖ వారి ఏర్పాట్లు ఉన్నాయి ) దగ్గరలోనే ఉన్న త్రేతాయుగం నాటి కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకోండి.
2.
మేడారం నుండి ఏటూరునాగారం 30 కిమీ ఇక్కడి నుండి అభయారణ్యం లోకి వెళ్లి చూసేందుకు, సేద తీరేందుకు అటవీశాఖ వారి ఏర్పాట్లు ఉన్నాయి.
(ఇక్కడే కాకుండా వరంగల్ జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా ఈ ఏర్పాట్లు ఉన్నాయి)
ఇక్కడి నుండి భద్రాచలం వెళ్లే దారిలో మంగపేట వద్ద మల్లూరు అటవీప్రాంతంలో కొలువై ఉన్న హేమాచల లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీరం వలె మెత్తని విగ్రహాన్ని కలిగి ఉంటారు. అక్కడినుండి నేరుగా భద్రాచలం చెరుకోవచ్చు.
మరోటి ఏటూరునాగారం నుండి మల్లూరు కాకుండా 17 కిమీ దూరంలో ఉన్న వాజేడు జలపాతాన్ని చేరుకొని అక్కడి నుండి పర్ణశాల మీదుగా భద్రాచలం వెళ్ళవచ్చు.
విహారయాత్రలకు వెళ్ళాలంటే నాకు చాలా ఇష్టం.
ReplyDelete