Saturday, 27 May 2017

జీలకర్ర బెల్లం లేకుండా పెళ్ళి


తెలంగాణల పెండ్లి చేసుకునే పోరగాల్లకు 
పెద్ద కష్టం వచ్చి పడ్డది. 
ఎక్కడా బెల్లం దొరుకుతలేదు,
 జీలకర్ర బెల్లం లేకుండా పెండ్లి చేసుడే లేదని 
అయ్యగార్లు అనబట్టిరి. ఇగ కష్టం కాక ఏంది? 
అసలు ఈ కష్టం ఎందుకచ్చిందో  తెలుసా. 
వచ్చే జూన్ ల బ్రాందీ షాపులకు  టెండర్లు ఉన్నయట, 
మరి ధర బాగ పలకాలంటే గుడంబా బంద్ గావాలె,
అంటే బెల్లం దొరుకద్దు..... 
ఉపాయం మంచిగానే ఉన్నది గని 
పెండ్లి చేసుకునే పోరగాండ్ల సంగతి ఎట్లా ??  
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అంటే గిదే. 
అయినా బాపనోళ్ళు జిలకర బెల్లం లేకుండా 
పెళ్లి చేసుడు నేర్సుకోవాలె.
గప్పుడే g కష్టాలు తీరుతై...

(బెల్లం కష్టాలు ఇవ్వాలే కాదు, దాదాపు తెలంగాణా రాష్ట్రం వచ్చిననాటినుండి ఉన్నాయి.)

ఇంకా చిత్రమైన విషయం ఏంటంటే గత 
మేడారం జాతరకు కూడా బెల్లం కోసం  
చాలా ఇబ్బంది ఏర్పడింది,
బెల్లం లేకుండా మేడారం జాతరను
 ఊహించనుకూడాలేము.
అలాగే గత ఉగాది కి కూడా. 
బెల్లం హిందూ సాంప్రదాయంలో ప్రతి కార్యక్రమం లో
 విడదీయరాని సంబధం కలిగి ఉంటుంది. 
మరి మన దగ్గరే నిషేదిస్తే ఎలా? 
బెల్లం పై ప్రభుత్వ పెద్దలకింత కక్ష ఎందుకో??

2 comments: