మద్యం సేవించి వాహనం నడుపరాదు ఇది పోలీసు, RTA వారి నినాదం
మద్యం అమ్మి ప్రభుత్వం నడుపరాదు
ఇది సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న నినాదం
మద్యం అమ్మి ప్రభుత్వం నడుపరాదు
ఇది సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న నినాదం
ఆదాయం కోసం మద్యపానానికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని,
దానికోసం ఇతర మార్గాలను అన్వేషించాలనేది చాలామంది మాట.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం
గత ఐదు సంవత్సరాలలో మన దేశంలో
తలసరి మద్య వినియోగం 38 శాతం
గత 20 యేల్లతో పోల్చిచూస్తే 65 శాతం పెరిగిందట.
బీద కుటుంబాలలోని మరణాలలో 45శాతం
మద్యం వల్లనేనన్నది నమ్మలేని నిజం.
దీనితో 75 శాతం కుటుంబాలను స్త్రీలే పోషించాల్సిన
పరిస్థితి ఏర్పడుతోంది . మద్యంవలన
18 నుండి 25 యేల్ల మధ్య వైధవ్యాన్ని పొందుతున్న వారెందరో...
ముఖ్యంగా యువత మద్యానికి తొందరగా ఆకర్షితులౌతున్నారు.
ముఖ్యంగా యువత మద్యానికి తొందరగా ఆకర్షితులౌతున్నారు.
దీంతో వారి ఆరోగ్యాలని చెడగొట్టుకోవడమే కాకుండా
రోడ్డు ప్రమాదాల రూపంలోఎదుటివాళ్ళ ప్రాణాలను కూడా తీసేస్తున్నారు.
ప్రభుత్వం మద్యనిషేధం విధించాలని కొన్ని చోట్ల
డిమాండ్ ఉన్నప్పటికీ కొంత అసాధ్యం అనే చెప్పవచ్చు.
మద్య నిషేధంతో మాఫియాలు, పోలీసులు మాత్రమే
లబ్ధి పొందుతున్నారని గతంలోనే రుజువైంది.
మద్య నిషేధం వల్ల రాష్ట్రంలో మాదక ద్రవ్యాల
మద్య నిషేధం వల్ల రాష్ట్రంలో మాదక ద్రవ్యాల
వినియోగం భారీగా పెరిగిపోయిందని
కేరళ ఎక్సైజ్ మంత్రి కూడా వాదిస్తున్నారు.
కాబట్టి అసంఖ్యాక కుటుంబాలను అతలాకుతలం
కాబట్టి అసంఖ్యాక కుటుంబాలను అతలాకుతలం
చేస్తున్న తాగుడు దురలవాటు నిర్మూలనకు
ప్రభుత్వం సామాజిక జాగృతి ఉద్యమాన్ని నిర్వహించాలి.
ఎయిడ్స్, గర్భస్థ ఆడ శిశువుల హత్యల వంటి దురాచారాలను
అరికట్టడంలో సామాజిక జాగృతి కార్యక్రమాలు
సాధించిన సత్ఫలితాలు మద్యపానం సమస్య విషయంలో
కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్నిస్తాయి.
No comments:
Post a Comment