Tuesday 4 April 2017

రోడ్డు ప్రమాదాలు ఆగేనా???

రోడ్డు ప్రమాదాల చట్టం సవరణతో ప్రమాదాలు ఆగుతాయా?


మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2016కు ప్రతిపాదించిన కీలక సవర ణలకు కేంద్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. 
 అతి వేగంగా వాహనం నడిపితే వెయ్యి నుంచి 4 వేల దాకా, కారులో సీటు బెల్టు పెట్టుకోకపోతే, టూవీలర్ పై వెళ్ళే వాళ్లకి హెల్మెట్ లేకుంటే  వెయ్యి, ఇన్సూరెన్స్ లేకుంటే 2 వేలు జరిమానా, లేదా మూడు నెలల జైలు శిక్ష,..ఇలా సరికొత్త నిబంధనలు నిర్దేశించారు. అంతేగాక.మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలవరకూ జరిమానా వసూలు చేస్తారు.

ఇక మైనర్లు ప్రమాదాలు చేస్తే వారి తలిదండ్రులపైనా, సదరు వాహన యజమానులపైనా కేసులు పెడతారు. రూ. 25 వేల ఫైన్, మూడేళ్ళ జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. హిట్ అండ్ రన్ బాధితులకు రూ. 2 లక్షలు, ప్రమాద మృతులకు రూ. 10 లక్షల సాయం అందించాలని  బిల్లు పేర్కొంటోంది. చట్టం అమల్లోకి వస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు 
తగ్గుతాయని భావిస్తున్నారు.

ఐతే చాలా సార్లు  అధికారులకు కూడా కొన్ని నిబంధనలపై, వాస్తవ పరిస్థితులపై అవగాహన లేదనిపిస్తుంది.
రా త్రిపూట జరిగే ప్రమాదాల్లో lowbeem లైట్లు వేయకపోవటం వల్లే ఎక్కువగా జరుగుతుంటాయి 
అటువంటి వాహనాలను గుర్తించడానికి ఏ అధికారి డ్యూటీ లో ఉండరు.
 ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా వాహనాన్ని స్టాప్ లైన్ దాటించకూడదు, జీబ్రా లైన్స్ వరకు తేకూడదు. ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్న పట్టించుకోరు. 
 మూల మలుపులో, వీధి కూడళ్ళలో  వాహన వేగాన్ని తగ్గించి హార్న్ కొట్టి వెళ్లాలి. 
 ఏ వాహనానికైన కంపినివారి హారన్ ను మాత్రమేవాడాలి .
 మ్యూజిక్ బయటికి వినపడకూడదు .
 స్కూళ్ళు హాస్పిటళ్ళు ఉన్న చోట హార్న్ వాడకూడదు. 
 వైపర్ (వర్షం పడినప్పుడు నీటిని పక్కకు తొలగించేది) తప్పనిసరిగా ఉండాలి
ఇలా చాల ఉన్నాయి.

 ఎక్కువ ప్రమాదాలు అతి వేగం వల్ల జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఏ వాహనమైనా 85 కిలోమీటర్ల వేగాన్ని మించరాదు కాని ఒక సర్వేప్రకారం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ పై వాహనాలు సరాసరి 120 కిలోమీటర్ల వేగం దాటి  వెళ్తున్నాయట . 
ఇక ఒక్కోసారి సైన్ బోర్డ్ లు చెట్ల చాటున అమర్చడం కూడా ప్రమాదాలకు కారణం అవుతోంది. 

పోలీసులు కేవలం ఫైన్ వేసి డబ్బులు వసూలు చేయటమే కాకుండా  వాహనదారులకు అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

No comments:

Post a Comment