ఒక నాలుగు రోజులు నెట్ ఆన్ చేయక పోవడంతో మనసు కాస్త ప్రశాంతంగా ఉంది.
ఐతే జియో ఆఫర్ అయిపోవటం , నేను ఆన్లైన్ లో లేకపోవటం తో అందరూ ఒకటే ప్రశ్నలు.
అంటే అందరూ జియోకు అంతగా అలవాటయ్యారన్నమాట. కాని నేను జియో వాడటంలేదు.
నాలుగు రోజుల క్రితం డేటాఐపోవటంతో మల్లి రీచార్జ్ చేయలేదంతే. నెట్ లేకుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నా ఇవ్వాల SBI aadhar based payment ప్రమోషన్లో భాగంగా బ్యాంకు నుండి ఒకతను రావటంతో మళ్లి recharge చేయవలసి వచ్చింది .
నా ప్రశాంతతకు ఇక మల్లి గండి పడినట్టే!
ఆన్ చేసిన వెంటనే ఒక్కటే whatsapp మెసేజ్ లు .
అవసరం ఉన్న లేకున్నా వివిధ గ్రూపుల్లో ఇరికించేసారు.
ఓ 30సమూహాలు , దాదాపు రోజు 1000 మెసేజ్ లు , ఫోన్ ఫోటోలతో నిండిపోతోంది. డిలిట్ చేయటం కష్టం అవుతోంది. ఒక్కరోజు మరచిపోతే వేలకువేలు gallaryలో అలాగే ఉంటున్నాయి. పోనీ గ్రూప్ ల నుండి exit అవుదామంటే ఏదైనా update మిస్ అవుతామేమో అని భయం, గ్రూప్లో మనల్ని కలిపినవాలు ఫీల్ అవుతారేమో అని బాధ. కాని నెట్ లేని రోజులే బాగున్నాయిఅని మాత్రం అర్థం అయ్యింది. కానీ నెట్ ను మాత్రం వదలలేకపోతున్నా.
ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో online payment ల కోసమైనా ఇంటర్ నెట్ అవసరమే.
కాబట్టి ఇక ప్రశాంతత అనేది కనుమరుగైనట్టే.
No comments:
Post a Comment