వరంగల్ నుంచి కాకతీయ బండి సికింద్రాబాద్ ల దిగి ఫిలింనగర్ బస్సులున్నా డబుల్ డెక్కర్ లకోసం చూసేటోల్లం. అది ఎక్కుతె అమీర్ పేటల దిగాలె, ఆడి నుంచి ఆటోల పోవాలె. కానీ రాత్రి 7.00 దాటుతే ఆటోలు ఉండకపోయేది. ఓరోజు బస్సు ఎక్కి పై అంతస్తుల కూసున్న, అమీర్ పేట దాటి మైత్రివనం (అప్పుడే కడుతున్నారు) వరకు పోయేదాక సూడలే. అక్కడ ఆపుమంటే SR నగర్ కాడ ఆపిండు. మల్ల ఆడి నుంచి ఎన్కకచ్చి యూసుఫ్ గూడ పోవాల్సివచ్చింది. ఆడికెల్లి డబుల్ డెక్కర్ ఎక్కి నా పై అంతస్తు ఎక్కలే.
నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
Tuesday, 17 January 2017
డబుల్ డెక్కర్ బస్సు
వరంగల్ నుంచి కాకతీయ బండి సికింద్రాబాద్ ల దిగి ఫిలింనగర్ బస్సులున్నా డబుల్ డెక్కర్ లకోసం చూసేటోల్లం. అది ఎక్కుతె అమీర్ పేటల దిగాలె, ఆడి నుంచి ఆటోల పోవాలె. కానీ రాత్రి 7.00 దాటుతే ఆటోలు ఉండకపోయేది. ఓరోజు బస్సు ఎక్కి పై అంతస్తుల కూసున్న, అమీర్ పేట దాటి మైత్రివనం (అప్పుడే కడుతున్నారు) వరకు పోయేదాక సూడలే. అక్కడ ఆపుమంటే SR నగర్ కాడ ఆపిండు. మల్ల ఆడి నుంచి ఎన్కకచ్చి యూసుఫ్ గూడ పోవాల్సివచ్చింది. ఆడికెల్లి డబుల్ డెక్కర్ ఎక్కి నా పై అంతస్తు ఎక్కలే.
Friday, 6 January 2017
ముక్కోటి ఏకాదశి
ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూపుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారతయుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజునఉపదేశించాడని విశ్వాసం ఉంది.
ముక్కోటి ఏకాదశిధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిపవిత్రమైనది.
విష్ణు ప్రీతికరమైన
ఏకాదశులలో ఇది అత్యంత
ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం
మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే
రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ
'ఏకాదశి' రోజున వేయికనులతో
వీక్షించి సేవించి తరంచి
పోవాలని మూడు కోట్లమంది
దేవతలు వైకుంఠమునకు చేరుకునే
పుణ్యప్రదమైన రోజు కనుక ఇది
వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి
ఏకాదశి" గా
భక్తులు పిలుస్తూ ఉంటారు.
ఇట్టి
పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో
పూర్ణిమకు ముందు వచ్చే
ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో
(తిరుపతి,
భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి వైష్ణవ)
పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే,
ఉత్తర ద్వారాలను మూసి
ఉంచుతారు. ఈ "ముక్కోటి
ఏకాదశి" రోజున
మాత్రం వాటిని తెరచి
ఉంచుతారు. ఆ
రోజు భక్తులు సూర్యోదయానికి
పూర్వమే నిద్రలేచి
కాలకృత్యములు,
స్నానసంధ్యాదులు ముగించుకొని
అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర
ద్వారం ద్వారా ప్రవేశించి
ప్రదక్షిణలు ముగించుకుని
దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు.
అలా ప్రదక్షిణ క్రమాన్నే
"ముక్కోటి ప్రదక్షిణ" అని
పిలుస్తూ ఉంటారు.
Tuesday, 3 January 2017
పరకాల స్వాతంత్ర్యపోరాటం
పంజాబ్లోని జలియన్వాలాబాగ్లో కిరాతకుడు జనరల్ డయ్యర్
ఆదేశానుసారం ఉద్యమకారులపై జరిపిన కాల్పులు దారుణ ఉదంతం.
అటువంటిదే మరొకటి... తెలంగాణలోని పరకాలలో నైజాం హయాంలో జరిగిన సంఘటన. 1947 ఆగష్టు 15న దేశమంతటికీ స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ కు రాలేదు.స్వతంత్రఅనంతరం అన్ని సంస్థానాలు భారతయూనియన్లో విలీనంచేసినప్పటికీ నిజాం రాజ్యాన్ని భారత్లో విలీనం చేయకపోవడంతో, నిజాం నిరంకుశత్వం, రజాకార్ల పాశావికత, వెట్టిచాకిరిలో హీనంగాబతుకుతున్న ప్రజల్లో ఆగ్రహంకట్టలుతెంచుకుంది. పాతపరకాల తాలూక l లోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో కటంగురికేశవరెడ్డి ,నాగారంకు చెందిన వీరగోపాలరావు , కోటయ్య ,మరికొంతమంది ప్రముఖుల ఆధ్వర్యంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయాలని సంకల్పించి ఉదయాన్నే గ్రామగ్రామలనుండి హాజరైన వేలాదిప్రజలతో ఊరేగింపుగా ెఅమరవీరుల మైదానానికి వె ళ్తున్న ప్రజలను ఒక్కసారిగా నిజాంసేనలు చుట్టుముట్టి ఖజానాను కొల్లగొట్టేందుకు వచ్చారనే నెపంతో 4000 మందిపై ఏ హెచ్చరికా లే కుండా ఒక్కసారిగా గర్జించాయి కర్కోటకుడైన ఖాసీంరజ్వీ సేనల తుపాకులు. ఫలి తం 13 మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు.
మాజీ ఎం పి విద్యాసాగర్ రావు ఈ సంఘటన ఎల్లప్పుడూ గుర్తు చేసేలా నిర్మించిన స్మృతి చిహ్నం ప్రతిఒక్కరిలో పోరాటపటిమను ప్రతీక్షణం పెంచుతుంది. అందుకే ఏ పోరాటాన్నైనా ఇక్కడి నుండే ప్రారంభించడాన్ని ఆనవాయితీ గా మార్చుకున్నారు పరకాల ప్రజలు
Thursday, 22 December 2016
పితృదేవోభవ
నాతొ మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్" అంటాడు,
కన్యాశుల్కంలో గిరీశం....
మరి నేనైతే మా బాపు తోమాట్లాడటమే ఎడ్యుకేషన్ అనేవాడిని.
ఇది వరకు నా బాల్యంలో గురువు,
గూగుల్ , డిక్షనరీ, వికీపీడియా అన్నీ మా బాపు నే. తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనేది నా ఫీలింగ్. తను ఏది చెప్పినా అనుభవసారమే. నాకే సమస్య ఎదురైనా తను చెప్పినదానిలోనుండే సమాధానం వెతుకుతూ ఉంటాను ఇప్పటికీ.
Saturday, 10 December 2016
గీతాజయంతి శుభాకాంక్షలు
అందరికీ గీతాజయంతి శుభాకాంక్షలు
నా చిన్నప్పుడు భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా చదువుకున్నా.
అందులో నాకు బాగా నచ్చిన వి ఈరెండు శ్లోకాలు
శ్రేయాన్ స్వధర్మోనిగుణ: పరధర్మాత్ స్వసుష్టితాత్
స్వధర్మేనిధనం శ్రేయ: పరధర్మో భయావహ:
పరధర్మమునందు ఎన్నోసుగుణములు ఉన్నను
స్వధర్మమునందు అంతగా సుగణ్ములు లేకున్నను చక్కగా
అనుష్టింపబడు ఆ పరధర్మముకంటెను స్వధర్మాచరణమే
ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయ
శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము.
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానాం సృజామ్యహమ
“ఓ భరత వంశీయుడా, అర్జునా, ధర్మం నశించి,
అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే
సృష్టించుకుంటూ ఉంటాను.” 🙏
Sunday, 4 December 2016
Thursday, 1 December 2016
భగవద్గీత
నా దృష్టిలో భగవద్గీత లాంటి గ్రంథాలు
యాంటీ వైరస్ బుక్స్.
మన మనసులోని వైరస్లని తొలగిస్తాయి.
పాజిటివ్గా చదివితే ఖచ్చితంగా
ఉపయోగపడుతుంది.