Tuesday, 17 January 2017

డబుల్ డెక్కర్ బస్సు

 నేను ఇంటర్ చదివేరోజుల్ల (1990-92) హైదరాబాదుల  డబుల్ డెక్కర్ బస్సులుండేటియి. 
అప్పుడు నేను చదివే కాలేజీ యూసుఫ్ గూడల ఉంటుడె.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగినంక వాటికోసం చూసేటోడ్ని, 
వరంగల్ నుంచి కాకతీయ బండి సికింద్రాబాద్ ల దిగి ఫిలింనగర్ బస్సులున్నా  డబుల్ డెక్కర్ లకోసం చూసేటోల్లం. అది ఎక్కుతె అమీర్ పేటల దిగాలె,  ఆడి నుంచి ఆటోల పోవాలె. కానీ రాత్రి 7.00 దాటుతే ఆటోలు ఉండకపోయేది.   ఓరోజు బస్సు ఎక్కి పై అంతస్తుల కూసున్న, అమీర్ పేట దాటి మైత్రివనం (అప్పుడే కడుతున్నారు) వరకు పోయేదాక సూడలే. అక్కడ ఆపుమంటే SR నగర్ కాడ ఆపిండు. మల్ల ఆడి నుంచి ఎన్కకచ్చి యూసుఫ్ గూడ పోవాల్సివచ్చింది. ఆడికెల్లి  డబుల్ డెక్కర్ ఎక్కి నా పై అంతస్తు ఎక్కలే.
ఈమధ్య ఓసారి హైదరాబాదు పోతే వాటికోసం చూసిన కానీ కనపడలే.. నడుపుతలేరు గావచ్చు. బస్సులు పోయినా డబుల్ డెక్కర్ రైల్లు వత్తానయికదా ఏదో ఒకటి....

2 comments:

  1. కొన్ని జ్ఞాపకాలు ఎంత వయసచ్చినా వెంతాడుతానే ఉంటై . అసొంటిదే ఇదిగూడ. అప్పుడు ఇంత ట్రాఫిక్ లేకుండే. అమీర్ పేట కు అరగంటల పోయేది బస్సు . మొన్న పొతే రొండు గంటలు పట్టింది.

    ReplyDelete