దక్షిణ భారతంలోని పశ్చిమ కనుమలకు చెందిన
దట్టమైన అరణ్యంలో కొండకోనల మధ్య ఉన్న శబరిమలకు బయలుదేరి ఉదయాన్నే 3.30కి పంపానదికి చేరిన మేము వెంటనే నదీస్నానం చేసి హరిహర సుతుని దర్శనానికి బయల్దేరాం కాలినడకన. నడవలేని వారికి డోలీలు ఉన్నాయి. దేవస్థానం వారి డోలీలైతే మంచిది. 7 కిలోమీటర్ల దూరంకూడా బృందంగా వెళ్లేసరికి కష్టంగా అనిపించలేదు.
గర్భగుడికి
చేరేందుకు మాలధారులు మాత్రం పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ఎక్కవలసి
ఉంటుంది. ప్రతి ఒక మెట్టు మనిషి లో ని ఒక లక్షణానికి
ప్రతీక అని ఒక నమ్మకం. మొదటి అయిదు మెట్లు
పంచేంద్రియాలని, తరువాత ఎనిమిది మెట్లు భావోద్వేగాలకి, ఆ
తరువాత మూడు మెట్లు మానవ గుణాలకి, చివరి రెండు మెట్లు
జ్ఞానం మరియు అజ్ఞానాలకి చిహ్నాలని అంటారు.
పరశురామ నిర్మిత ఈ ఆలయం 1907-1909 మధ్యకాలంలో
అగ్నికి ఆహుతి అవడంతో మరల
పునఃనిర్మించి శిలా విగ్రహానికి బదులు
పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం
పెరిగిందంటారు. ఒక గంట నిరీక్షణతోనే స్వామి దర్శనభాగ్యం కలిగింది. భక్తవత్సలుడి రూపం చూడగానే జేసుదాసు పాడిన పాట మనసులో మెదిలింది. శ్రితజనప్రియం స్వామి చించితప్రదం
శృతి
విభూషణం
స్వామి
సాధుజీవనం
శృతి మనోహరం స్వామి గీతాలాలసం
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయ
తర్వాత మాలిగపురంమాత ఆలయం, ఇతరత్రా దర్శించి వెనుదిరిగాం.
నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
Tuesday 8 November 2016
శబరిమల
Subscribe to:
Post Comments (Atom)
Super Anna....
ReplyDeletethank you
Delete