స్త్రీ గౌరవాన్ని మలినం చేస్తూ స్శర్శించే ఒక మగవాడి దురహంకారాన్ని
సమాజంలోంచి చంపేసి, తుదముట్టించే తుపాకి కావాలి .
అభంశుభం తెలియని బాలల జీవితాలను చిద్రం చేసే కర్కోటకులను కడతేర్చే తుపాకీ కావాలి.
కోట్లాది అమాయక ప్రజల జీవితాలని బలి తీసుకుంటున్న
ఉగ్రమూలాల్ని సమూలంగా పెకిలించే తుపాకి కావాలి .
చట్టాలను అతిక్రమించే చుట్టాలను తుదముట్టించే తుపాకీ కావాలి.
ఆర్టిక అసమానతలను పెంచుతున్న విధానాలని నిషేధించే తుపాకీ కావాలి.
మతం పేరుతొ జనం ప్రాణాల్ని హరిస్తున్న మూర్ఖులను నిలువరించే తుపాకీ కావాలి.
ఆ తుపాకి మోత వింటే చాలు ఎవరైనా తప్పు చేయాలంటేనే భయపడాలి .
అటువంటి ఒక తుపాకి నాకు కావాలి
"ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే "
అన్న మాట మరిచిన ఓ గోపాల....
నీ పాంచజన్యాన్ని తుపాకిగా నాకందించు!
కృత, త్రేత, ద్వాపర యుగాలను మించిన స్వర్ణ యుగాన్ని నేనీ ప్రపంచానికందిస్తా.
No comments:
Post a Comment