ట్రంప్ వచ్చాక అమెరికాలో ఇప్పటిదాకా ఏకంగా 1,000 కి పైగా
జాతి వివక్ష దాడుల ఘటనలు జరిగాయి .
అత్యధికం యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే జరుగుతుండడంతో అటు
భారతీయ విద్యార్థులు , ఇక్కడ తల్లితండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు .
అసలే ఒళ్ళంతా జాత్యహంకారం కలిగివుండే తెల్లవాళ్ళను ట్రంప్ వ్యాఖ్యలు బాగా
రెచ్చగొడుతున్నాయి.
'మా దేశం నుంచి వెళ్లిపొండి...’ తెలుగు ఇంజనీర్ ను కాల్చి చంపుతూ
దుండగుడు గట్టిగా అరుస్తూ అన్న మాటలు చాలు,
వారి నరనరాన జాతి వివక్ష ఎలా జీర్ణించుకుపోయిందో తెలుసుకోవడానికి .
అమెరికాను మళ్లీ గొప్పదేశంగా నిలబెడదాం’ అనే నినాదం తో ప్రచారం చేసిన ట్రంప్
తన చర్యలతో అమెరికాను ఇప్పుడున్న స్థితి నుండి పతనం వైపు తీసుకెళ్ళకపోతే చాలు అనేది చాలా మంది అమెరికన్ల మాట .
చాలామంది వలసలకు అనుకూలంగా ఉన్నా కొంతమంది చర్యల వల్ల విదేశీయులు
సహజంగానే తీవ్ర అభద్రతా భావానికి గురవుతున్నారు .
ఐతే ద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారంచేసే సంస్థలు ట్రంప్ గెలిచాక
300 శాతానికి పెరిగాయి .
వీరి విద్వేషానికి అధ్యక్షుని మద్దతుకూడా ఉంది కదా !
తానేమీ ప్రపంచానికి ప్రతినిధిని కాదని,
కేవలం అమెరికాకు మాత్రమే అధ్యక్షుడిని అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ద్వారా
ట్రంప్ అక్కడ ఉన్న విదేశీయులకు తానేమి రక్షణ కల్పించాలనుకోవడం లేదని
మా దేశాన్ని విడిచి వెళ్ళడమే ఏకైక మార్గమని చెప్పకనే చెప్పాడు .
ఈ సమయంలో భారతీయులు అమెరికాలో ఉండడం ఎంతవరకు శ్రేయస్కరం .
హెచ్1బి వీసాల విషయంలో తొందరపాటు చర్యలు సరికాదని అమెరికాను కోరకుండా
ప్రధాని మోడీ భారతీయులందరినీ
తిరిగి స్వదేశానికి రమ్మని కోరితే బాగుండేది.
ప్రపంచం మొత్తం ఒకవైపు అమెరికా ఒక్కటి ఒకవైపు అనే అభిప్రాయాన్ని కలిగిన
అమెరికన్లు తమ పతనానికి తామే
బాటలు వేసుకుంటున్నారు తెలివైన వాళ్లని కోల్పోవడం ద్వారా.