"ప్లాస్టిక్ నిషేధం"
మాటలకే పరిమితమైన ఒక గొప్ప ప్రణాళిక
ప్లాస్టిక్ కవర్ల వల్ల
పర్యావరణానికి చేటని ఎంతో మంది నిపుణులు
చెబుతున్నా ఆ మాటలను పెడచెవిన పెట్టి
యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం జరుగుతోంది.
ఇంకా..
ప్లాస్టిక్ తీవ్రమైన వాతావరణం కాలుష్యం కలిగిస్తుంది అనేది
అందరికి తెలిసిన గొప్ప సత్యం కానీ మానటం అయిష్టం
అందరికి తెలిసిన గొప్ప సత్యం కానీ మానటం అయిష్టం
ఎందుకంటే అంత చవకలో మరో ప్రత్యామ్నాయం లేకపోవటం కారణం
కిరాన సరకులు, మందులు తెచ్చుకున్నా , కూరగాయలు,హోటళ్ళనుండి ఇలా కవర్లలో టీ, టిఫిన్ లాంటి వేడి ఆహార పదార్థాలు ప్యాక్ చేసినప్పుడు పేగులు, కడుపు సంబంధిత కాన్సర్ లను కలిగించే రసాయనాలు తీవ్ర స్థాయిలో ఆహారం లో కలుసున్నట్టుగా కనుగొన్నారు.
ప్లాస్టిక్ కవర్ల నిషేధంలో భాగంగా 40 మైక్రాన్ల కంటే మందంగా ఉండే
కవర్లే వాడాలనే నిబంధన ఉంది కానీ ఇవికూడా భూమిలో త్వరగా కరిగిపోవు,
కానీ పునర్వినియోగానికి అవకాశానికి అవకాశముంటుంది,
వ్యాపారులు కూడా ఆర్ధిక భారం తో
వాడకం తగ్గిస్తారనే ఆలోచన అయివుండొచ్చు.
ప్లాస్తిక్ వినియోగాన్ని క్రమబద్దీకరించి నిషేధాన్ని సరిగా
అమలు పరచటంలో విఫలమైన దేశాల్లో మనది ఒకటి.
కవర్లు పారవేయడం వల్ల భూమిపై ఒక పోరలాగ ఏర్పడి వాన నీటిని ఇంకకుండా అడ్డుకుంటున్నాయి దాంతో నీటి కరువు ముప్పు పొంచి ఉంది.
ఇంకా సముద్ర కాలుష్యం లో దాదాపు80 శాతం ప్లాస్టిక్ వే ఉంటున్నాయి.
ఇంకా సముద్ర కాలుష్యం లో దాదాపు80 శాతం ప్లాస్టిక్ వే ఉంటున్నాయి.
జలచరాలు, పశుపక్ష్యాదుల మరణానికి కారణమౌతోంది
మనిషిఅలసత్వమే ముఖ్య కారణంగా
మనకి జీవనాధారమైన గాలి, నీరు, భూమి అన్నీ కలుషితం అవుతున్నాయి
ప్లాస్టిక్ కవర్లతో జరిగే నష్టాలను ప్రజలకు
తెలిసే విధంగా ప్రభుత్వం, మేధావులు కృషి చేయాలి.
ప్రత్యామ్నాయాలు చూపిస్తూ
ప్రత్యామ్నాయాలు చూపిస్తూ
మెల్లమెల్లగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం నుంచి
దూరం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
ప్రతి ఒక్కరూ బాధ్యత గా ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేసినప్పుడే మీపిల్లలు
" నేను పెరిగి పెద్దవాడినయ్యే వరకు ఈ అందమైన ప్రకృతిఇలాగే ఉంటుందా?"
" నేను పెరిగి పెద్దవాడినయ్యే వరకు ఈ అందమైన ప్రకృతిఇలాగే ఉంటుందా?"
అని అడిగితే
ఉంటుంది అని సమాధానం ఇవ్వగలరు
ఉంటుంది అని సమాధానం ఇవ్వగలరు
కాబట్టి నేను ప్లాస్టిక్ వాడను అని వెంటనే ఒక నిర్ణయం తీసుకోండి.
మార్కెట్కు వెళ్ళినా, కిరాణా షాపుకు వెళ్ళిన
ఒక సంచి తెసుకొని వెళ్ళటం అలవాటు చేసుకోండి
అందమైన ప్రకృతి, ఆరోగ్యకర జీవితాన్ని
పిల్లలకందివ్వలేనపుడు ఎన్ని కోట్లు కూడబెట్టి వారికిచ్చినా ఫలితం శూన్యంకదా !!!