ఇప్పుడు మా వూళ్ళో ఏ చౌరాస్తా లో నిలబడి చూసినా
కనీసం ఒక అయిదు, ఆరు గణపతి మండపాలు
కనిపిస్తాయి. లౌడ్ స్పీకర్లలో పాటలు మొగుతూంటాయి.
అందరూ గణపతి ఉత్సవాలను బాలగంగాధర్ తిలక్
ప్రవేశపెట్టాడు అనుకుంటారు,కాని అంతకుముందే ఉన్న
వీటికి స్వాతంత్రోద్యమ కాలంలో బాగా ప్రాచుర్యం కలిపించి
ప్రజలందరినీ సంఘటితం చేయటానికి వేదికగా వాడుకున్నాడు.
అప్పుడు ఊరికో గణపతిని ప్రతిష్టించి అందరూ అక్కడికే వచ్చేవారు.
కాని ఇప్పుడు ఒక్కో పార్టీకి, కమ్యునిటికి,గుడికి, బడికి, వాడకు
వేరు వేరుగా ప్రతిష్టించి ఎవరికివారే పూజలు చేసుకుంటున్నారు.
హిందువులకు
భక్తి ఉన్నది.. కానీ శక్తిలేదు అని కొందరు
అంటుంటారు. అవును సంఘటిత శక్తి లేదు అనిపిస్తుంది
ఇన్ని మండపాలు చూసినపుడు.
ఇందులో ఆర్భాటానికో, చందాలు దండుకోవటానికో కొన్ని
వెలిస్తే కొన్ని మాత్రం దీన్ని వేదికగా చేసుకొని ఎన్నో
హర్షించదగిన సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాయి.
ఆర్య వైశ్య యువజన సంఘం వారు మాత్రం
ఎక్కువగా సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తారు.
మొదటి రోజు మట్టి గణపతి ప్రతిమలు ఉచిత పంపిణీ నుండి మొదలుకొని
విద్యలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, వివిధ అంశాలపై
వ్యాసరచన పోటీలు, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకను చాటుతారు.
ఇప్పటివరకు మా ఊళ్ళో ఏ ఉత్సవాలకు
పెద్దగ గొడవలు జరిగిన దాఖాలాలు లేవు .
కాని ఈసారి పోలీసులు ఎక్కువగా నిబంధనలు విధించారు.
ఐతే ఇన్ని మండపాలు ఒక్కొక్కటిగా తగ్గి ఒక్కటే ఐతే ఎంతోసంతోషం
మా ఊరు ఊరంతా ఐకమత్యంగా ఉన్నారని , కానీ నెరవేరదు కదా .