ఎపుడైనా కొత్త వాళ్ళు కాని, చాల రోజుల తర్వాత కలిసిన మిత్రులుకాని
నన్ను, పిల్లల్ని ఒక్క చోట చూస్తే మాత్రం ఆశ్చర్య పోతుంటారు.
నలభై దాటినా ఇరవై లాగే పిల్లలతో సమానంగా ఉన్నావు అంటారు.
మా ఫ్రెండ్స్ నన్ను తరచుగా అడిగే మాట కూడా ఇదే
ఎలా ఇంత బాగా fitness మేంటైన్ చేస్తున్నావు అని.
ఆ రహస్యం ఏంటో మాకూ చెప్పకూడదు అంటుంటారు.
నేను మాత్రం తలకు రంగు వేసుకోకపోతే
వీళ్ళే నన్ను ముసలోడివైపోయావురోయ్
అనేవాళ్ళని నవ్వుకునేవాడిని. నేను కూడా
రెండు మూడేళ్ళ క్రితం వరకు జుట్టుకు రంగు వేసేవాడినే కాదు.
అలా వేసుకొని ఒకసారి మా అమ్మాయి వాళ్ళ కాలేజికి వెళ్తే
అక్కడ స్టాఫ్ నన్ను పేరెంట్ అంటే నమ్మనే లేదు.
ఇక పిల్లలైతే వెళ్లి మీ అన్నయ్యోచ్చాడు అని చెప్పటంతో
మా అమ్మాయీ నవ్వుకుంది. అప్పుడు రంగు వేసుకోవటం మానేస్తే...
మరీ వెంట్రుకలు తెల్లబడిపోయాయని ఈ మధ్యే మళ్ళీ మొదలెట్టాను.
ఇక టాపిక్ లోకి వస్తే...
ఎవరైనా చనిపోతే
భూమ్మీద నూకలు చెల్లిపోయాయి అనటం మనం చూస్తుంటాం.
అసలు అర్థం అంతా అందులోనే ఉంది.
మనం తక్కువగా తిని ఎక్కువరోజులు బతుకొచ్చు అని.-
సాధారణంగా ఎక్కువ పని చేసే ఒక మనిషికి శాస్త్రీయంగా
రోజుకి 2000 క్యాలరీల శక్తికితగ్గ ఆహార పదార్ధాలు కావాలి .
దానిని 1200 లకో, 1300 లకో తగ్గించుకుంటే ఎక్కువకాలం బ్రతకొచ్చట.
అలా తగ్గించాలంటే జివ్హచాపల్యం చంపుకోలేని వాళ్ళు ఎన్నో
కష్టాలు పడాలి మరి. నలభై ఏళ్ళు వచ్చిన తరువాత
మన శరీర జీవక్రియల వేగం తక్కువవుతుంది కాబట్టి వ్యాయామం తో పాటు
క్యాలరీలు తగ్గించాలి మరి. యుక్తవయస్సు లో ఉన్నప్పుడు రాల్లైన
క్యాలరీలు తగ్గించాలి మరి. యుక్తవయస్సు లో ఉన్నప్పుడు రాల్లైన
అరిగించుకోవచ్చు అని కొసరి కొసరి వడ్డించే వాళ్ళనిప్రేమతో
ఏమి అనకపోయినా నలభై దాటాక మాత్రం
నిర్మొహమాటంగా వద్దని చెప్పాల్సిందే. అథవా తిన్నా ఎదో ఒక వ్యాయామం
చేసి తిన్నది కాస్తా కొవ్వుగా మారక ముందే కరిగించాల్సిందే.
ఇది చదివాక కూడా మీరు మారలేదనుకోండి నేనేమీ చేయలేను
ఇది చదివాక కూడా మీరు మారలేదనుకోండి నేనేమీ చేయలేను
నాలా షాపులో కూర్చునేవాడికి, సాఫ్టువేరు వాళ్లకు, కుర్చీ లోంచి లేవకుండా పని
చేసుకోనేవాల్లకు రోజుకి 1500-1700 కాలరీలు అవసరం
ఇక మీ మీ అవసరాల ద్రష్ట్యా మీకు ఎంత అవసరమో తినండి .
నా మట్టుకు నేను మాత్రం తినేదేదైన 1200-1500 కాలరీల వరకు ఉండేలా
కూరలు ఎక్కువగాను అన్నం తక్కువగాను అదీ కూడా మూడు పూటలు
తినేలా ప్లాన్ చేసుకున్నాను. ఇక మీరు కూడా మీకోసం
దేవుడిచ్చిన నూకలు పొదుపుగా వాడుకొంటే ఎక్కువ రోజులు ఫిట్ గా బతకొచ్చు.
నా మట్టుకు నేను మాత్రం తినేదేదైన 1200-1500 కాలరీల వరకు ఉండేలా
కూరలు ఎక్కువగాను అన్నం తక్కువగాను అదీ కూడా మూడు పూటలు
తినేలా ప్లాన్ చేసుకున్నాను. ఇక మీరు కూడా మీకోసం
దేవుడిచ్చిన నూకలు పొదుపుగా వాడుకొంటే ఎక్కువ రోజులు ఫిట్ గా బతకొచ్చు.
(తక్కువ తినేవారే ఎక్కువ కాలం బ్రతుకుతారని శాస్త్రీయంగా ధ్రువీకరింపబడింది)