నాతొ మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్" అంటాడు,
కన్యాశుల్కంలో గిరీశం....
మరి నేనైతే మా బాపు తోమాట్లాడటమే ఎడ్యుకేషన్ అనేవాడిని.
ఇది వరకు నా బాల్యంలో గురువు,
గూగుల్ , డిక్షనరీ, వికీపీడియా అన్నీ మా బాపు నే. తనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదనేది నా ఫీలింగ్. తను ఏది చెప్పినా అనుభవసారమే. నాకే సమస్య ఎదురైనా తను చెప్పినదానిలోనుండే సమాధానం వెతుకుతూ ఉంటాను ఇప్పటికీ.
నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
Thursday, 22 December 2016
పితృదేవోభవ
Saturday, 10 December 2016
గీతాజయంతి శుభాకాంక్షలు
అందరికీ గీతాజయంతి శుభాకాంక్షలు
నా చిన్నప్పుడు భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా చదువుకున్నా.
అందులో నాకు బాగా నచ్చిన వి ఈరెండు శ్లోకాలు
శ్రేయాన్ స్వధర్మోనిగుణ: పరధర్మాత్ స్వసుష్టితాత్
స్వధర్మేనిధనం శ్రేయ: పరధర్మో భయావహ:
పరధర్మమునందు ఎన్నోసుగుణములు ఉన్నను
స్వధర్మమునందు అంతగా సుగణ్ములు లేకున్నను చక్కగా
అనుష్టింపబడు ఆ పరధర్మముకంటెను స్వధర్మాచరణమే
ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటయ
శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహము.
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత |
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానాం సృజామ్యహమ
“ఓ భరత వంశీయుడా, అర్జునా, ధర్మం నశించి,
అధర్మం పెచ్చు మీరినప్పుడల్లా నన్ను నేనే
సృష్టించుకుంటూ ఉంటాను.” 🙏
Sunday, 4 December 2016
Thursday, 1 December 2016
భగవద్గీత
నా దృష్టిలో భగవద్గీత లాంటి గ్రంథాలు
యాంటీ వైరస్ బుక్స్.
మన మనసులోని వైరస్లని తొలగిస్తాయి.
పాజిటివ్గా చదివితే ఖచ్చితంగా
ఉపయోగపడుతుంది.