Showing posts with label కర్ణాటక. Show all posts
Showing posts with label కర్ణాటక. Show all posts

Saturday, 5 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 8

ఇక మాప్రయాణంలో చివరిదైన
మైసూరు... ముందుగా
చాముండేశ్వరి ఆలయానికి
బయలుదేరాం విపరీతమైన వర్షం...
మేం టూర్ బయలుదేరిన 2 వ రోజు
హుబ్లీ ధార్వాడ్ దగ్గర మొదలైన
వర్షం మైసూరు వరకు మమ్మల్ని
వదలలేదు. వర్షం పైగా ఆదివారం
హిల్ రోడ్
మొత్తం ట్రాఫిక్ జాం. ఐనా పోలీసు ల
తొందరగా నే క్లియర్
చేసారు. మహిషాసుర మర్ధిని
చాముండి అమ్మవారి దర్శనం
తొందరగా నే అయింది 100 రూ టిక్కట్
తో. తర్వాత మహారాజ పాలెస్
వెల్లాం. బయటకు వచ్చే సరికి 4.00
అయింది. ఆరోజు
భోజనం అప్పుడయ్యింది. ఇక
బృందావన్ గార్డెన్స్
బయల్దేరగానే మళ్ళీ ట్రాఫిక్ జాం
అన్నారు. అప్పటి కే 7.30 దాటడం
తో చేరుకోలేమని నిరుత్సాహంగానే
వెనుదిరిగి షాపింగ్ చేసుకొని
(రేట్లు మామూలు కంటే చాలా
ఎక్కువే) ఇంటిబాట పట్టాం 8 రోజు
టూర్ ముగించుకొని.

కర్ణాటక యాత్రా విశేషాలు 7

ధర్మస్థల నుండి మైసూరు
బయలుదేరి హసన్ వచ్చే సరికి పడమ
కనుమల నుండి మైదాన
ప్రాంతంకొచ్చాం. హంపి నుండి
గోకర్ణం వెళ్లే దారిలో ధార్వాడ్ దాటిన
తర్వాత మొదలైంది ఘాట్ రోడ్డు. హసన్
దాటి చాలా వరకు రాగానే పెరుగు
కొందామని నేను చెప్పడంతో బస్సు
చిన్న వూల్లో ఆపాం.
(పిల్లలతోఇబ్బంది అవుతుందని
క్యాటరింగ్ వాల్లని వెంట
తెచ్చకున్నాం).
పెరుగును ఏమని అడగాలి అసలే
పల్లెటూరు అనుకున్నా కానీ
నా ఫోన్లో ఉన్న ట్రాన్స్లేటర్
ముసురు అని చూపెట్టింది,
షాపులో ఉన్న 10 సంవత్సరాల కుర్రాడు అది చూసి
మాతో హిందీ లో మాట్లాడడంతో
హమ్మయ్య అనుకున్నా . మా మిగతా
బస్సులు వెళ్ళిపోయాయి. అక్కడి
నుండి కొంత దూరం
వెళ్ళిన తర్వాత 3 రోడ్లు రావడం తో
మావాల్లు ఎటు వెల్లారో
తెలియలేదు. ఇక చూడాలి మా బస్సు
వాల్లు నన్ను చంపేద్దామనేంతగా
నానా గొడవ చేస్తే కొందరేమో ఏం
బాధలేదురా బాబు మన మొత్తం
టూర్ లో అన్నీ వీడు ముందే ప్లాన్
చేస్తున్నాడు, ఏదో ఒకటి చేస్తాడులే
అన్నారు.(టూర్ మొత్తంలో
రూములు బుక్ చేయడం నుం
ఎక్కడ భోజన , వసతి ఏర్పాట్లు వగైరా.
నీల్లకు మాత్రం చాలా ఇబ్బందైంది.
20 లీటర్ల టిన్ 100 నుండి 300 రూ)
అంతలోనే మా అబ్బాయి ముందు
బస్ లో ఉన్న వాడి ఫ్రెండ్ తో వాట్సప్ లో
గూగుల్ లొకేషన్ తెప్పించకోవడంతో
మావాల్లు శ్రీరంగపట్టణం
వెల్తున్నారని అర్థం
అయింది.అక్కడికి చేరేసరికి రాత్రి 11.00
అయ్యింది. అక్కడ మా బస
గుడి ముందే ఉన్న రంనాథ
కళ్యాణమండపంలో ఏర్పాటు
చేసుకున్నాం. నేను
మరో నలుగురు మిత్రులు పక్కనే
ఉన్న కావేరి నదిలో స్నానానికి పెళ్ళాం,
నీల్లు ఎక్కువ గా లేవు. దైవ
దర్శనం చేసుకున్న
తర్వాత మావాల్లంతా షాపింగ్ లో
మునిగిపోయారు. అన్ని హాం డీ క్రాఫ్
లు ఇక్కడ మైసూరు కంటే సగం
ధర కే లభిస్తాయి. టిప్పు పాలెస్
కూడా చూసి, బయల్దేరాం. ఇక
తర్వాత ప్రయాణం మైసూరు..

Friday, 4 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 6

ధర్మస్థల చేరేసరికి బాగా రాత్రి
అయ్యింది. ఇక్కడ పెద్దగా
ప్రయివేటు హోటల్ లు లేవు అన్ని
దేవస్థానం వారివే. మాకు ఇక్కడ వసతి
వెంటనే దొరికింది (గంగోత్రి కాటేజి)
మేం వెళ్ళిన మొత్తం టూర్ లో ఇక్కడే
తక్కువగా ధర రూములకి . ఆలయ
అద్భుతంగా కేరళ ఆలయాల
రీతిలో ఉంది. దాదాపు గా తిరుపతి లో
ఎలా నిర్వహణ ఉంటుందో అలాగే
ఉంది. ఇక్కడ ఆలయంలో గత 800 సంవత్సరాలుగా నిరాటంకంగా అన్నదానం సాగుతోందట.కర్ణాటక లోని దాదాపు అన్ని
ఆలయాలలో భక్తులకు అన్నదానం
నిర్వహిస్తున్నారు. ఆటోలోకల్ 10 రూ
తీసుకుంటారు. కానీ కాస్త దూరం
ఉండే రామాలయానికి 300
తీసుకున్నారు ముగ్గురికి.
వాస్తవానికి జీపు లాంటిది 400
కే వచ్చింది. రెండు చూడదగిన
మ్యూజియంలుకూడా
ధర్మస్థలలో ఉన్నాయి. పరుగెత్తించే
మన జీవితంలో ఆగి ఆస్వాదించాల్సినవి
ఎన్నో ఉన్నాయనిపించింది. మా
తరువాతి ప్రయాణం
ఇండియన్ హెరిటేజ్ సిటీ మైసూరు
కు.

Thursday, 3 November 2016

కర్ణాటక యాత్రా విశేషాలు 5

10 గంటల కల్లా ఉడిపి లో దర్శనం
పూర్తి చేసుకున్న మేము మరో
గంటలో శృంగేరికి బయలుదేరాం.
ఆగుంబే మీదుగా ఘాట్ రోడ్ డ్రైవింగ్
కష్టం అని అక్కడి వాల్లు చెప్పడం
తోకర్కాల మీదుగా 30 కిలోమీటర్ల
దూరం ఎక్కువైనా అలాగే వెల్లాం .
పూర్తిగా అడవి తో నిండిన ఘాట్
రోడ్ కావటం తో మేం శృంగేరి చేరేసరి
సాయంత్రం 3.00
అయింది. బస్సులోనుండి కాలు
కింద పెట్టగానే ఒక చిరుజల్లు
ముఖాన్ని తాకింది. గొడుగు
తీసుకుని శారదాపీఠానికి బయల్దేరాం.
ఆదిశంకరులు అద్వైతం
ప్రచారం చేయడానికి నెలకొల్పిన
నాలుగు మఠాలలో తుంగా తీరంలో ని
శృంగేరి శారద మఠం మెదటిది. గంగా
స్నానం తుంగా పానం రెండూ
అంతే గొప్పవని అక్కడివాల్లు
చెప్పారు. నీల్లు స్వచ్చంగా
ఉన్నాయి.ముందుగా శారదామాత
ఆలయం దర్శించుకున్నాం,
పురాతన ఆలయం అగ్నికి ఆహుతి
కావడంతో పునః నిర్మించారట. ఇక్కడ చాలా
మంది స్త్రీ లు అమ్మవారి కి ఒడి
బియ్యం, చీరెలను
సమర్పిస్తున్నారు.
తరువాత విద్యాశంకర ఆలయాన్ని 5.00
గంటల కు తెరచినాక దర్శించాం,
ఇదొక సైన్సు అద్భుతం.
సూర్యుడు రాశులు
మారినప్పుడల్లా కిరణాలు ఒక్కో
స్థంభం పైన మార్చి పడుతాయట.
ఆరోజు మఠంలో స్వామివారి దర్శనం
లేదనడంతోనది అవతలి వైపున ఉన్న
గురు నివాస్ కి వెళ్లకుండానే
ధర్మస్థలకు మా ప్రయాణం
ప్రారంభించాం. ఇక్కడ వసతి కోసం
టిటిడి వారి భవనం కూడా ఉంది.
ఇక్కడ పోలీసు వాల్లు పెట్టిన బోర్డు
చూడండి.

కర్ణాటక యాత్రా విశేషాలు 4

మురుడేశ్వర్ నుండి బయలుదేరి
మేము బత్కల్ దగ్గర
భోజనం ముగించుకొని ఉడిపి
చేరేసరికి రాత్రి 11.00 అయింది.
దేవాలయం ఎదురుగా హోటల్ మధుర
లో రూం తీసుకున్నాం (600రూ)
బాగుంది. ఉదయాన్నే 6.00 గంటలకు
ఆలయానికి వెళ్ళాం. 7.00 గంటలకు
స్వామి వారి అలంకరణ కోసమని
క్యూలైన్ని లిపివేయడంతో పక్కనే
ఉన్నచంద్రమౌళీశ్వర ఆలయాన్ని,
దర్శించుకొని మళ్ళీ వరుసలో నిలబ
అరగంట లో ఆలయం లోకి
పెళ్లాం. అచంచల విశ్వాసం కలిగిన
భక్తుని కోసం
భగవంతుడు దిగివస్తాడనేందుక
ఈ ఆలయం నిదర్శనం.
నిమ్నజాతికులస్థడైన కనకదాసుకు
ఆలయ ప్రవేశం
అనుమతించకపోవడంతో అతని కోస
శ్రీకృష్ణ భగవానుడు
పడమరాభిముఖంగా దర్శనమిచ్చినట్లు
ఇక్కడి స్థల పురాణాలుచెప్తున్నాయి. ఆ
కారణంగానే ఇక్కడ దేశంలో ఎక్కడా లేని
విధంగా ఇక్కడ భక్తులకు గర్భాలయ
దర్శనం ఉండదు. స్వామివారిని
కిటికీగుండా మాత్రమే
దర్శించుకోవాలి. ఈ కిటికీని నవరంధ్ర
కిటికీ అని పిలుస్తారు. ఇక్కడ ఈ
దేవాలయ సింహద్వారం
తూర్పుముఖంగా ఉన్నప్పటికీ
స్వామివారు మాత్రం
పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు.
ఎంత చూసినా తనివి తీరని స్వామి
వారి దివ్యమోహన రూపాన్ని మనసున
నిలుపుకొని ముందుకు కదిలాం .

కర్ణాటక యాత్రా విశేషాలు 3

గోకర్ణం నుండి మురుడేశ్వర్ 80
కిలోమీటర్లే ఐనా రోడ్ ఇప్పుడే నాలుగ
లేన్ల హైవే గా మారుస్తుండడం,
రద్దీ ఎక్కువ గా ఉండడంతో
దాదాపుగా 3 గంటల
సమయం పట్టింది.అరేబియా
తీరంలోని పంచ శైవ క్షేత్రాలో
మురుడేశ్వర్ ఒకటి.
ఆత్మలింగాన్ని పైకి లేపలేకపోయిన
రావణుడు ఆత్మలింగాన్ని
తీసుకువచ్చిన పెట్టెను ఉత్తరం
వైపు నుంచి లాగడంతో అది
విసురుగా వెళ్ళి దూరంగా
పడిపోతుంది. అక్కడ సజ్జేశ్వర
లింగం వెలుస్తుంది. పెట్టె
మూతపడిన చోట గుణేశ్వర లింగం
ఉద్భవిస్తుంది.
లింగంపై కప్పబడిన వస్త్రం పడిన
చోట మురుడేశ్వర లింగం
వెలుస్తుంది. పెట్టెను కట్టిన
(తాళ్ళు) పడినచోట
ధారేశ్వరలింగం ఉద్భవిస్తుంది.ఈ
లింగాల మధ్య స్వామివారి
ఆత్మలింగం మహాబలేశ్వరలింగం
గోకర్ణంలో వెలుస్తుంది.
ఆత్మలింగంతో ముడిపడిన
ఐదుక్షేత్రాలను శైవ
పంచక్షేత్రాలని పిలుచుకుంటారు
కర్ణాటకలో. మురుడేశ్వర్ ఆలయ
గోపురం ప్రపంచం లోనే పెద్దదిగా
చెప్పవచ్చు. 18 అంతస్తులు.
సముద్రం మధ్యలో దీవిపై
మహాశివుని అతి పెద్ద విగ్రహం
ఇంకా అద్భుతం. ఇక్కడి నుండి
తర్వాతి ప్రయాణం ఉడిపి కి.