మొన్న ఒక రోజు సిటీకి వెళ్ళినప్పుడు
ఆటోలో వెళ్తుంటే పెద్ద ఊరేగింపు
ఎదురుగా రావటంతో ఆటో పక్కకు ఆపాడు డ్రైవర్.
ముందు పెద్ద బ్యాండు మేళం ,ఆ వెనకే చప్పుడ్లు
కొంత మంది డాన్స్ లు చేస్తున్నారు,
ఇంకా ఓ 30,40 కార్ల వరుస
దాదాపు ఓ 50మందితో పెళ్లి ఊరేగింపు అనుకున్నా,
కాని ఎక్కడో తేడా కొడుతోంది
దగ్గరికొచ్చాక చూద్దునుగదా అది శవయాత్ర.
ఆశ్చర్యం ఇంతపెద్దగానా అంతిమయాత్ర .
బాగా డబ్బు, పలుకుబడి కలిగిన వ్యక్తట.
దాదాపు ఓ 3 లక్షల పైనే ఖర్చు ఉండొచ్చు.
ఆ మాత్రం లేకపోతె ఎలా? అన్నారు.
కాకపొతే నాదొక్క డౌటు చనిపోయిన రోజే
ఇంత ఖర్చు చేస్తే మిగతా 11 రోజులు
ఎంత ఖర్చు ఉంటుందో ..
అయినా డబ్బున్నోడి ఇంట
చావుకూడా పెళ్ళిలాంటిదే
No comments:
Post a Comment