అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....
ప్రపంచంలోని ఏ మతానికీ లేని ప్రత్యేకత హిందూ ధర్మానికి సొంతం .
ప్రపంచంలోని ఏ మతానికీ లేని ప్రత్యేకత హిందూ ధర్మానికి సొంతం .
ఎన్నో మతాలు, ధర్మాలు, వర్గాలు, కులాలూ ఉన్నప్పటికీ
పూల దండలోని దారం ఎలాగైతే వివిధ రకాల, రంగుల, వాసనల
పూవులను కలిపి ఉంచుతుందో అదేవిధంగా
భారతీయులందరినీ హిందూ ధర్మం అలాగే కలిపి ఉంచుతుంది.
ఇదే ఇక్కడి గొప్పతనం.
అటువంటి హిందూ ధర్మంలోని సాంప్రదాయాలు,
ఆచారాలు, పండుగలు విభిన్నం,ప్రత్యేకం.
ఇందులో ముఖ్యమైనది రాఖీపౌర్ణమి.
అన్నచెల్లి, అక్కాతమ్ముల్ల అనుబంధానికి ప్రతీక ఈ పండగ .
ప్రపంచంలోని ఏ మతంలోనూ,దేశంలోనూ ఈ పండుగ కనిపించదు.
నిజానికి అన్నాచెల్లెల బంధం ఎంత అపురూపమైనది!
అన్నాచెల్లెల బంధము చిక్కని స్నేహానుబంధ సీమలకన్నన్
మిక్కిలి పైస్థాయినిపెంపెక్కిన చక్కని విశిష్ట ప్రేమామృతమౌ
అంటాడో కవి...
అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు….
కుటుంబంలో ఆప్యాయతలకు నెలవైన
అనుబంధాలు.
చెరిగిపోని, కరిగిపోని ప్రేమానుబంధాలు.
అమ్మ, నాన్న తర్వాత అంతటి
ప్రేమాభిమానాలు ఉండేది సోదరీసోదరుల మధ్యనే.
అక్కో చెల్లినో రాఖీ కడుతుంటే
మురిసిపోని సోదరుడు ఉంటాడా చెప్పండి.
కానీ 'ప్రేమా... గీమా'
అంటూ వెంటపడేవారిని వదిలించుకోవడానికో..
బహుమతులను ఆశించి 'అన్నా' అంటూ పొడి పొడి అప్యాయతలతోనో
రాఖీలు కట్టి నవ్వులపాలు కాకండి.
మరొక్కసారి
అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....
అందరికీ రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు....
No comments:
Post a Comment