Friday, 27 January 2017

పట్టుపట్టి జల్లికట్ట్టు

నెమ్మదిగా హిందువుల పండుగలు, ఉత్సవాలను కనుమరుగు చేసేందుకు జరుగుతున్న కుట్రలు న్యాయస్థానాలనుకూడా ప్రభావితం చేసి తమకనుగుణంగా తీర్పు రాబట్టడంలో సఫలీకృతం అవుతున్నాయి కొన్ని విదేశీ శక్తులు.
భారత దేశ వెన్నుముక
అయిన తన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వాని
చిన్నాభిన్నం చేయకుండా మనం ఆ దేశాన్ని ఆక్రమించగలమని
నేను భావించటం లేదు అని  అన్న మెకాలే వారసులు విదేశీ విష సంస్కృతిని మన పై రుద్దుతూ వారసత్వ పండుగలు, ఉత్సవాలను అపహాస్యం చేస్తున్నారు. వీరికి కొన్ని విదేశీ సంస్థలు సహకరించడం, ఇంకా మన  సెలబ్రిటీలు తందాన అని వంతపాడుతూ వకాల్తా తీసుకోవడం....
        కొన్ని సార్లు కోర్టులు కూడా సాంప్రదాయాలు, సామాజిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని తమపరిధిని అవసరానుగుణంగా  మార్చుకొంటే  బాగుంటుంది. ఎక్కడో విదేశాల్లో పుట్టిన పండగలు, ప్రత్యేక దినాలు జరుపుకునే మనం మన సాంప్రదాయాలను ఎందుకు కొనసాగించలేకపోతున్నాం . అంటే వారి సాంప్రదాయాలు మాత్రమే గొప్పవనే విషబీజాన్ని మన మదిలో నాటుతున్నారు.

తమిళనాడు లో జల్లికట్టు, కర్ణాటక లో కంబల, మహారాష్ట్ర లో ఎడ్ల బండ్ల పందాలు, తెలుగునాట కోళ్ళ పందాలు మరోచోట మరోటి... ఏదైతేనేం. ఉత్సవం హిందువులదైతే చాలు దానిపై నానా రభస చేసి వాటిని శాశ్వతంగా కనుమరుగు చేయాలకున్న ఆలోచన కే మంచి గుణపాఠం తమిళుల తిరుగుబాటు..  మరికొన్ని ప్రాంతాల ప్రజలు కూడా వీరి బాటలో నడిచేందుకు  ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభిచడం వారి సాంప్రదాయాలను కాపాడుకోవాలనే ఆతృతగానే చూడాలి తప్ప వేరొకలా కాదు

Tuesday, 24 January 2017

మన మీడియా

జర్నలిజమా ......
అదెప్పుడో అమ్ముడు పోయింది.
జర్నలిజం అంటే ఎవరి మీదా ప్రత్యేక మైన ఇష్టం....
కోపం....అసహనం లేకుండా ప్రజలకు  సమాచారం అందించడమే.
అంతే కానీ  సొంత అబిప్రాయాలు.....సొంత ఇష్టాలను
చెప్పడమే జర్నలిజం, సొమ్మున్నోడికి అమ్ముడు పోవడం, అవసరాలు తీర్చేవాడికి కొమ్ముకాయడం    అనే స్తాయికి  దిగజార్చారు .

Tuesday, 17 January 2017

డబుల్ డెక్కర్ బస్సు

 నేను ఇంటర్ చదివేరోజుల్ల (1990-92) హైదరాబాదుల  డబుల్ డెక్కర్ బస్సులుండేటియి. 
అప్పుడు నేను చదివే కాలేజీ యూసుఫ్ గూడల ఉంటుడె.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగినంక వాటికోసం చూసేటోడ్ని, 
వరంగల్ నుంచి కాకతీయ బండి సికింద్రాబాద్ ల దిగి ఫిలింనగర్ బస్సులున్నా  డబుల్ డెక్కర్ లకోసం చూసేటోల్లం. అది ఎక్కుతె అమీర్ పేటల దిగాలె,  ఆడి నుంచి ఆటోల పోవాలె. కానీ రాత్రి 7.00 దాటుతే ఆటోలు ఉండకపోయేది.   ఓరోజు బస్సు ఎక్కి పై అంతస్తుల కూసున్న, అమీర్ పేట దాటి మైత్రివనం (అప్పుడే కడుతున్నారు) వరకు పోయేదాక సూడలే. అక్కడ ఆపుమంటే SR నగర్ కాడ ఆపిండు. మల్ల ఆడి నుంచి ఎన్కకచ్చి యూసుఫ్ గూడ పోవాల్సివచ్చింది. ఆడికెల్లి  డబుల్ డెక్కర్ ఎక్కి నా పై అంతస్తు ఎక్కలే.
ఈమధ్య ఓసారి హైదరాబాదు పోతే వాటికోసం చూసిన కానీ కనపడలే.. నడుపుతలేరు గావచ్చు. బస్సులు పోయినా డబుల్ డెక్కర్ రైల్లు వత్తానయికదా ఏదో ఒకటి....

Friday, 6 January 2017

ముక్కోటి ఏకాదశి

         ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూపుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారతయుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజునఉపదేశించాడని విశ్వాసం ఉంది. 

ముక్కోటి ఏకాదశిధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశిపవిత్రమైనది.

విష్ణు ప్రీతికరమైన
ఏకాదశులలో ఇది అత్యంత
ప్రధానమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం
మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతే
రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని ఈ
'ఏకాదశి' రోజున వేయికనులతో
వీక్షించి సేవించి తరంచి
పోవాలని మూడు కోట్లమంది
దేవతలు వైకుంఠమునకు చేరుకునే
పుణ్యప్రదమైన రోజు కనుక ఇది
వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి
ఏకాదశి" గా
భక్తులు పిలుస్తూ ఉంటారు.
ఇట్టి
పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో
పూర్ణిమకు ముందు వచ్చే
ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో
(తిరుపతి,
భద్రాచలం, యాదగిరిగుట్ట వంటి వైష్ణవ)
పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే,
ఉత్తర ద్వారాలను మూసి
ఉంచుతారు. ఈ "ముక్కోటి
ఏకాదశి" రోజున
మాత్రం వాటిని తెరచి
ఉంచుతారు. ఆ
రోజు భక్తులు సూర్యోదయానికి
పూర్వమే నిద్రలేచి
కాలకృత్యములు,
స్నానసంధ్యాదులు ముగించుకొని
అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర
ద్వారం ద్వారా ప్రవేశించి
ప్రదక్షిణలు ముగించుకుని
దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు.
అలా ప్రదక్షిణ క్రమాన్నే
"ముక్కోటి ప్రదక్షిణ" అని
పిలుస్తూ ఉంటారు.

Tuesday, 3 January 2017

పరకాల స్వాతంత్ర్యపోరాటం

భారతదేశ స్వాతంత్రోద్యమకాలంలో 1919 ఏప్రిల్ 13న
పంజాబ్లోని జలియన్వాలాబాగ్లో కిరాతకుడు జనరల్ డయ్యర్
ఆదేశానుసారం ఉద్యమకారులపై జరిపిన కాల్పులు దారుణ ఉదంతం.

            అటువంటిదే మరొకటి... తెలంగాణలోని పరకాలలో నైజాం హయాంలో  జరిగిన సంఘటన. 1947 ఆగష్టు 15న దేశమంతటికీ స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణ కు రాలేదు.స్వతంత్రఅనంతరం అన్ని సంస్థానాలు భారతయూనియన్లో విలీనంచేసినప్పటికీ నిజాం రాజ్యాన్ని భారత్లో విలీనం చేయకపోవడంతో, నిజాం నిరంకుశత్వం, రజాకార్ల పాశావికత, వెట్టిచాకిరిలో హీనంగాబతుకుతున్న ప్రజల్లో ఆగ్రహంకట్టలుతెంచుకుంది. పాతపరకాల తాలూక l    లోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో కటంగురికేశవరెడ్డి ,నాగారంకు చెందిన వీరగోపాలరావు , కోటయ్య ,మరికొంతమంది ప్రముఖుల ఆధ్వర్యంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేయాలని   సంకల్పించి ఉదయాన్నే  గ్రామగ్రామలనుండి హాజరైన వేలాదిప్రజలతో ఊరేగింపుగా ెఅమరవీరుల మైదానానికి వె ళ్తున్న ప్రజలను ఒక్కసారిగా నిజాంసేనలు చుట్టుముట్టి ఖజానాను కొల్లగొట్టేందుకు వచ్చారనే నెపంతో 4000 మందిపై ఏ హెచ్చరికా లే కుండా ఒక్కసారిగా గర్జించాయి కర్కోటకుడైన ఖాసీంరజ్వీ సేనల తుపాకులు. ఫలి తం 13 మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు.  
           
          మాజీ ఎం పి విద్యాసాగర్ రావు ఈ సంఘటన ఎల్లప్పుడూ గుర్తు చేసేలా నిర్మించిన స్మృతి చిహ్నం ప్రతిఒక్కరిలో పోరాటపటిమను ప్రతీక్షణం పెంచుతుంది. అందుకే ఏ పోరాటాన్నైనా ఇక్కడి నుండే ప్రారంభించడాన్ని ఆనవాయితీ గా  మార్చుకున్నారు  పరకాల ప్రజలు