అమెరికాలోని విదేశీయులను తరిమికొడతాం, మన ఉద్యోగాలు మనకే అన్న ట్రంప్ నినాదంతో సంబరపడి అధికారాన్నిచ్చిన అమెరికన్లకు వాస్తవ పరిస్థితులు అనుభవంలోకి రావడానికి ఎన్నోరోజులు పట్టలేదు. చాలాచోట్ల జరిగిన నిరసనలే దీనికి తార్కాణం.
ఒకవేళ అమెరికా లో ఉన్న భారతీయులందరినీ తిరిగి పంపితే... వాల్లంతా తిరిగి ఇండియాకే వస్తే..
మన ప్రధాని నినాదం మేక్ ఇన్ ఇండియా తోడైతే, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడడానికి ఎన్నో సంవత్సరాలు పట్టకపోవచ్చు.
అమెరికా అభివృద్ధి లో భారతీయులదే కీలకపాత్ర అనడంలో అనుమానమే లేదు. అదే భారతీయులు మాతృభూమి కోసం పనిచేయలేరా? భారతీయ ఉద్యోగుల పై ఆధారపడి పనిచేసే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలు ఇండియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు ప్రాంభించేలా ప్రోత్సాహిస్తే .. భారత్లో మౌలిక వసతులు, ప్రోత్సాహకాలు ఉండవనే అపోహను తొలగిస్తే ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా ఇండియా బాట పట్టవచ్చు. ఇవే జరిగితే ఇండియా సూపర్ పవర్ కావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టకపోవచ్చు. (కానీ ఈ విషయం లో చైనా గట్టి పోటీదారు కావచ్చు)
అమెరికా భారతీయులెవరూ అవమానం తో తలదించుకొని రావలసిన అవసరం లేదు. నా మాతృభూమికి సేవ చేసే అవకాశం వచ్చిందని రాజీనామాలు చేసి గర్వంగా రండి. కంపెనీలన్నీ మీ వెనకే ఇండియాకి క్యూ కట్టకపోతే చూడండి.
ప్రపంచ పెద్దన్న పతనం ఖాయం.
నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
No comments:
Post a Comment