మహాగణపతి దేవాలయం కొట్టారక్కర
తిరువనంతపురం బయలుదేరిన మాతో డ్రైవర్ దారిలో మరో ప్రముఖ దేవస్థానం తీసుకెళ్తాననటంతో సరేనన్నాం. అయితే దగ్గర లోనే అనుకున్నాం కానీ దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెద్ద కోనేరు, విశాలమైన మండపాలతో పెద్దగా ఉంది ఆలయం. వాస్తవానికి ఇది శివాలయం కానీ మహాగణపతి దేవాలయం గా ప్రసిద్ధికెక్కింది. పూర్వకాలంలో ఇక్కడి రాజులు శివాలయం నిర్మిస్తున్నపుడు దగ్గరలో ఉన్న పుట్టలోనుండి మంత్రాలు వినపడడంతో తవ్వి చూడగా వెలసిన గణపతి పేరనే ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఓనం మాసం కావడంతోమేము వెళ్లిన సమయంలో ఆలయం లో ప్రత్యేక పూజలు జరుతుండడంతో దర్శనానికి అరగంట సమయం పట్టింది. తూర్పు ముఖంగా శివుడు, దక్షిణ ముఖంగా గణపతి, ఉత్తరంవైపు అయ్యప్ప స్వామి, పడమర వైపు పార్వతిదేవి దర్శనమిస్తారు. బియ్యం, బెల్లం, అరటిపండు, చెక్కర, నెయ్యి, కొబ్బరితో చేసిన మధురమైన ఉన్నిఅప్పం అనే వంటకాన్ని గణపతి కి సమర్పించి ప్రసాదంగా ఇస్తున్నారు. ఇది కేరళ లో చాలా ప్రసిద్ధమైంది.
నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
No comments:
Post a Comment