గురువాయూరు
కేరళలో అడుగుపెట్టిన తర్వాత మేము దర్శించిన మొదటి
క్షేత్రం.
గతనెలలో శబరిమల వెళ్ళినప్పుడు మేము తక్కువ సమయంలో
ఎక్కువ క్షేత్రాలు దర్శించాలనే నా ఆలోచనతో ఎర్నాకులం వరకు
రిజర్వేషన్ చేయించినప్పటికీ త్రిసూర్ లోనే దిగాం. అక్కడి నుండి
గురువాయూరు, త్రిప్రయార్, బాహుబలి షూటింగ్ చేసిన
అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ చూసుకొని శబరిమల వెళ్లాలని అని
నిర్ణయించుకున్నాం. రైలు ఆలస్యం, మాట్లాడుకున్న బస్ కూడా
లేటవడంతోమా ప్లాన్ తారుమారై అనుకున్నవి కాకుండా వేరే చూశాం.
ఆలయం సాయంత్రం 5.30 తెరుస్తారని పెళ్లాం కానీ
సూర్యాస్తమయం తర్వాత దీపాలంకరణ చేసిన తర్వాతే
తెరుస్తారు. కేరళ మందిరాలలో ప్రత్యేకత గర్భగుడి చుట్టూ
ఉండే
వేల దీపాలు, ప్రధాన ద్వారం ముందు ఉండే దీపతోరణాలు.
అలాగే ఇక్కడి ప్రాకారాలు ప్రత్యేకమైన ఆకారం
కలిగిఉంటాయి. ఇతర దక్షిణ భారతదేశ దేవాలయాలలా
గోపురాలు ఉండవు. సాయంత్రం కాగానే ఈ మందిరాలలో
దీపాలన్నిటినీ వెలిగిస్తారు. వీటికి ప్రత్యేకమైన
వ్యవస్థ కూడా ఉంటుంది.
ఓనం పండగ సమయం కావడంతో వేలసంఖ్యలో భక్తులుండడంతో
దర్శనానికి చాలా సమయం పట్టింది. మా తర్వాత ప్రయాణం
త్రిప్రయార్ కు. 8.30కల్లా గుడి మూసేస్తారని ఎంత వేగంగా
వెళ్ళినా 8.35 అయింది. నిరాశే. ఇక వాటరఫాల్స వెళ్దామంటే
రాత్రి కుదరదని నేరుగా శబరిమల బయల్దేరాం
నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
No comments:
Post a Comment