Saturday, 22 April 2017

మద్యం సేవించి .....




మద్యం సేవించి వాహనం నడుపరాదు ఇది పోలీసు, RTA వారి నినాదం 
మద్యం అమ్మి ప్రభుత్వం నడుపరాదు

ఇది సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న నినాదం


ఆదాయం కోసం మద్యపానానికి ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని,
 దానికోసం ఇతర మార్గాలను అన్వేషించాలనేది చాలామంది మాట. 
ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం
 గత ఐదు సంవత్సరాలలో మన దేశంలో
 తలసరి మద్య వినియోగం 38 శాతం
 గత 20 యేల్లతో పోల్చిచూస్తే 65 శాతం పెరిగిందట.

 
బీద కుటుంబాలలోని మరణాలలో 45శాతం
 మద్యం వల్లనేనన్నది నమ్మలేని నిజం.
 దీనితో 75 శాతం కుటుంబాలను స్త్రీలే  పోషించాల్సిన
 పరిస్థితి ఏర్పడుతోంది . మద్యంవలన
 18 నుండి 25 యేల్ల మధ్య వైధవ్యాన్ని పొందుతున్న వారెందరో...
ముఖ్యంగా యువత మద్యానికి తొందరగా ఆకర్షితులౌతున్నారు.
 దీంతో వారి ఆరోగ్యాలని చెడగొట్టుకోవడమే కాకుండా 
 రోడ్డు ప్రమాదాల రూపంలోఎదుటివాళ్ళ ప్రాణాలను కూడా తీసేస్తున్నారు.


ప్రభుత్వం మద్యనిషేధం విధించాలని కొన్ని చోట్ల  
డిమాండ్ ఉన్నప్పటికీ కొంత అసాధ్యం అనే చెప్పవచ్చు. 
మద్య నిషేధంతో మాఫియాలు, పోలీసులు మాత్రమే
 లబ్ధి పొందుతున్నారని గతంలోనే రుజువైంది.
మద్య నిషేధం వల్ల రాష్ట్రంలో మాదక ద్రవ్యాల 
వినియోగం భారీగా పెరిగిపోయిందని 
కేరళ ఎక్సైజ్‌ మంత్రి కూడా వాదిస్తున్నారు.
కాబట్టి  అసంఖ్యాక కుటుంబాలను అతలాకుతలం
 చేస్తున్న తాగుడు దురలవాటు నిర్మూలనకు 
 ప్రభుత్వం సామాజిక జాగృతి ఉద్యమాన్ని నిర్వహించాలి. 
 ఎయిడ్స్‌, గర్భస్థ ఆడ శిశువుల హత్యల వంటి దురాచారాలను
 అరికట్టడంలో సామాజిక జాగృతి కార్యక్రమాలు
 సాధించిన సత్ఫలితాలు మద్యపానం సమస్య విషయంలో
 కూడా ఖచ్చితంగా మంచి ఫలితాన్నిస్తాయి.

Saturday, 15 April 2017

చల్లని చల్లని వేసవి కోసం

వేసవి ఎంత వేడిగా ఉంటుందో... ఆ వేడిలో చల్లదనం తగిలితే అంత హాయిగా ఉంటుంది.
 అందుకే, ఎండాకాలంలో చల్లగా  ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి,
ఈ సీజన్ లో లభించే ఏ పళ్ళను వదలకండి .అన్నిటిని తినండి.
పుచ్చకాయ, ఖర్బుజ, దోస, తాటి ముంజలు వంటివి ఒంట్లో చలువను కలిగిస్తే ,
 ఫలరాజం మామిడి ఎన్నో పోషకాలనిస్తుంది

పుచ్చకాయ లో  బీటా కెరోటి, విటమిన్ ఎ, బి1, బి6 మరియు విటమిన్ సి, పొటాషియం,
 మెగ్నీషియం, మ్యాంగనీస్, బయోటిన్, కాపర్లులు అధికగా ఉన్నాయి .
 ముఖ్యంగా వాటర్ దీని  లో వాటర్ కంటెంట్ 92శాతం ఉంటుంది.
 సమ్మర్ సీజన్లో వాటర్ మెలోన్ తినడం వల్ల రిఫ్రెష్ అవుతారు.


మామిడి పళ్ళు మన శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందిస్తుంది.
ఒకచిన్న  మామిడి పండులో 107 కేలరీల శక్తి
ఒక గ్రామ్ ప్రోటీన్,28 గ్రాముల కార్బోహైడ్రేట్లు,2.6 గ్రాముల పీచు పదార్ధం
3 మిల్లీగ్రాముల సోడియం,ఒక రోజుకు శరీరానికి అవసరం అయ్యే విటమిన్ సి లో 65 శాతం
విటమిన్ ఇ , విటమిన్  బి 6,శరీరానికి అవసరం అయ్యే ఫోలేట్ ఉంటాయి.



ఇక కర్బూజా  వేడి గాలులనుండి రక్షణనిస్తుంది , ఇందులోని  పొటాషియం
 రక్తపోటును అదుపులో ఉంచటం, మూత్రపిండాల్లో
 రాళ్లు తయారు కాకుండా ఆపటం లాంటివి చేస్తుంది.
 మలబద్ధకం సమస్యను తగ్గించటంలో ఖర్బూజా  బెస్ట్ .

ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా డీహైడ్రేషన్ అయిపోవడం సర్వసాధారణం.
ముంజలతోఈ సమస్య అధికమించవచ్చు
 ముంజల్లో శరీరానికి కావాల్సిన ఎ, బి, సి విటమిన్లు, ఐరన్, జింక్, ఫాస్ఫరస్,
 పొటాషియం.. వంటివి పుష్కలం.

ఇక చల్లని వేసవి మీ సొంతం 

Saturday, 8 April 2017

నా నెట్ గోల




ఒక నాలుగు రోజులు నెట్ ఆన్ చేయక పోవడంతో మనసు కాస్త ప్రశాంతంగా ఉంది.
ఐతే జియో ఆఫర్ అయిపోవటం , నేను ఆన్లైన్ లో లేకపోవటం తో అందరూ ఒకటే ప్రశ్నలు.
అంటే అందరూ జియోకు అంతగా అలవాటయ్యారన్నమాట. కాని నేను జియో వాడటంలేదు.
నాలుగు రోజుల క్రితం డేటాఐపోవటంతో మల్లి రీచార్జ్ చేయలేదంతే. నెట్ లేకుంటే ఎంత ప్రశాంతంగా ఉన్నా ఇవ్వాల SBI aadhar based payment ప్రమోషన్లో భాగంగా  బ్యాంకు నుండి ఒకతను రావటంతో మళ్లి recharge చేయవలసి వచ్చింది .
నా ప్రశాంతతకు ఇక మల్లి గండి పడినట్టే!
ఆన్ చేసిన వెంటనే ఒక్కటే whatsapp మెసేజ్ లు .
అవసరం ఉన్న లేకున్నా వివిధ గ్రూపుల్లో ఇరికించేసారు.
 ఓ 30సమూహాలు , దాదాపు రోజు 1000 మెసేజ్ లు , ఫోన్ ఫోటోలతో  నిండిపోతోంది.   డిలిట్ చేయటం కష్టం అవుతోంది. ఒక్కరోజు మరచిపోతే వేలకువేలు gallaryలో అలాగే ఉంటున్నాయి. పోనీ గ్రూప్ ల నుండి exit అవుదామంటే ఏదైనా update మిస్ అవుతామేమో అని భయం, గ్రూప్లో మనల్ని కలిపినవాలు ఫీల్ అవుతారేమో అని బాధ. కాని నెట్ లేని రోజులే బాగున్నాయిఅని మాత్రం అర్థం అయ్యింది. కానీ నెట్ ను మాత్రం వదలలేకపోతున్నా.
ఎందుకంటే ఇంకా కొన్ని రోజుల్లో online payment ల కోసమైనా ఇంటర్ నెట్ అవసరమే.
 కాబట్టి ఇక ప్రశాంతత అనేది కనుమరుగైనట్టే.

Wednesday, 5 April 2017

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు

Tuesday, 4 April 2017

రోడ్డు ప్రమాదాలు ఆగేనా???

రోడ్డు ప్రమాదాల చట్టం సవరణతో ప్రమాదాలు ఆగుతాయా?


మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2016కు ప్రతిపాదించిన కీలక సవర ణలకు కేంద్ర కేబినెట్‌ శుక్రవారం ఆమోదం తెలిపింది. 
 అతి వేగంగా వాహనం నడిపితే వెయ్యి నుంచి 4 వేల దాకా, కారులో సీటు బెల్టు పెట్టుకోకపోతే, టూవీలర్ పై వెళ్ళే వాళ్లకి హెల్మెట్ లేకుంటే  వెయ్యి, ఇన్సూరెన్స్ లేకుంటే 2 వేలు జరిమానా, లేదా మూడు నెలల జైలు శిక్ష,..ఇలా సరికొత్త నిబంధనలు నిర్దేశించారు. అంతేగాక.మద్యం తాగి వాహనం నడిపితే రూ.10 వేలవరకూ జరిమానా వసూలు చేస్తారు.

ఇక మైనర్లు ప్రమాదాలు చేస్తే వారి తలిదండ్రులపైనా, సదరు వాహన యజమానులపైనా కేసులు పెడతారు. రూ. 25 వేల ఫైన్, మూడేళ్ళ జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. హిట్ అండ్ రన్ బాధితులకు రూ. 2 లక్షలు, ప్రమాద మృతులకు రూ. 10 లక్షల సాయం అందించాలని  బిల్లు పేర్కొంటోంది. చట్టం అమల్లోకి వస్తే చాలావరకు రోడ్డు ప్రమాదాలు 
తగ్గుతాయని భావిస్తున్నారు.

ఐతే చాలా సార్లు  అధికారులకు కూడా కొన్ని నిబంధనలపై, వాస్తవ పరిస్థితులపై అవగాహన లేదనిపిస్తుంది.
రా త్రిపూట జరిగే ప్రమాదాల్లో lowbeem లైట్లు వేయకపోవటం వల్లే ఎక్కువగా జరుగుతుంటాయి 
అటువంటి వాహనాలను గుర్తించడానికి ఏ అధికారి డ్యూటీ లో ఉండరు.
 ఏ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కూడా వాహనాన్ని స్టాప్ లైన్ దాటించకూడదు, జీబ్రా లైన్స్ వరకు తేకూడదు. ట్రాఫిక్ పోలీసులు అక్కడే ఉన్న పట్టించుకోరు. 
 మూల మలుపులో, వీధి కూడళ్ళలో  వాహన వేగాన్ని తగ్గించి హార్న్ కొట్టి వెళ్లాలి. 
 ఏ వాహనానికైన కంపినివారి హారన్ ను మాత్రమేవాడాలి .
 మ్యూజిక్ బయటికి వినపడకూడదు .
 స్కూళ్ళు హాస్పిటళ్ళు ఉన్న చోట హార్న్ వాడకూడదు. 
 వైపర్ (వర్షం పడినప్పుడు నీటిని పక్కకు తొలగించేది) తప్పనిసరిగా ఉండాలి
ఇలా చాల ఉన్నాయి.

 ఎక్కువ ప్రమాదాలు అతి వేగం వల్ల జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఏ వాహనమైనా 85 కిలోమీటర్ల వేగాన్ని మించరాదు కాని ఒక సర్వేప్రకారం హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ పై వాహనాలు సరాసరి 120 కిలోమీటర్ల వేగం దాటి  వెళ్తున్నాయట . 
ఇక ఒక్కోసారి సైన్ బోర్డ్ లు చెట్ల చాటున అమర్చడం కూడా ప్రమాదాలకు కారణం అవుతోంది. 

పోలీసులు కేవలం ఫైన్ వేసి డబ్బులు వసూలు చేయటమే కాకుండా  వాహనదారులకు అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.